Viral Video : 10 వేల అడుగుల ఎత్తులో G20 ఫ్లాగ్.. స్కైడైవ్‌తో IAF అధికారి అద్భుత ప్రదర్శన

G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శన మార్చిలో జరిగినప్పటికీ G20 సమ్మిట్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

Viral Video : 10 వేల అడుగుల ఎత్తులో G20 ఫ్లాగ్.. స్కైడైవ్‌తో IAF అధికారి అద్భుత ప్రదర్శన

Viral Video

Updated On : September 8, 2023 / 5:56 PM IST

Viral Video : భూమికి 10,000 అడుగుల ఎత్తులో G20 ఫ్లాగ్ రెపరెపలాడింది. G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

G20 dinner : జి 20 డిన్నర్‌కు మన్‌మోహన్ సింగ్, దేవగౌడ, నితీష్ కుమార్‌కు ఆహ్వానం

‘వసుధైవ కుటుంబం-ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్ తో G20 2023 జెండాను మోస్తూ వింగ్ కమాండర్ గజానంద్ యాదవ్ చేసిన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్‌ను ఆకట్టుకుంది. ఓవైపు G20 సమ్మిట్ కోసం ప్రపంచ అగ్రనేతలు అంతా ఢిల్లీకి చేరుతున్న సమయాన భారత వైమానిక దళ అధికారి (IAF) గజానంద్ యాదవ్ చేసిన స్కైడైవింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

G20 Summit 2023: ఢిల్లీలోని ఏయే లగ్జరీ హోటల్లో ఏయే దేశాల అధ్యక్షులు ఉంటారో తెలుసా?

G20 2023 జెండాను పట్టుకుని గజానంద్ యాదవ్ 10వేల అడుగుల ఎత్తున ఎగురుతూ సాహోసోపేతమైన ప్రదర్శన ఇచ్చారు. ఉత్కంఠభరితమైన వీడియో ఫుటేజ్ ఈ సంవత్సరం మార్చి నాటిది అయినప్పటికీ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. G20 సమ్మిట్‌లో 40 మందికి పైగా దేశాధినేతలు, ప్రభుత్వ అధికారులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు న్యూఢిల్లీలో సమావేశం అవుతున్నారు. ప్రగతి మైదానంలోని ప్రతిష్టాత్మకమైన భారత్ మండపం కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమం జరగుతోంది.