Light Combat Helicopter: అక్టోబర్ 3న ఐఏఎఫ్‌లోకి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు.. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి రూ.3,887 కోట్లతో ఎల్‌సిహెచ్ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కోసం 10, సైన్యం కోసం ఐదు కొనుగోలుకు మార్చిలో కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

Light Combat Helicopter: అక్టోబర్ 3న ఐఏఎఫ్‌లోకి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు.. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

light combat helicopter

Updated On : September 16, 2022 / 9:22 PM IST

Light Combat Helicopter: భారత వైమానిక దళం (IAF) అక్టోబరు 3న జోధ్‌పూర్ వైమానిక దళ స్టేషన్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల(LCH)ను అధికారికంగా ప్రవేశపెట్టనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ కమిటీ దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మార్చిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి రూ. 3,887 కోట్లతో వైమానిక దళం, సైన్యం కోసం 15 హెలికాప్టర్లను కొనుగోలు చేసింది.

PM Modi Meets Putin: మోదీ, పుతిన్ భేటీలో యుక్రెయిన్ యుద్ధంపై చర్చ.. పుతిన్ ఏమన్నారంటే..

ప్రారంభంలో ఆమోదించబడిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి హెలికాప్టర్లలో 10 భారత వైమానిక దళం కోసం, ఐదు సైన్యం కోసం కేటాయించారు. హెలికాప్టర్ ఆయుధాలు, ఇంధనంతో 5,000 మీటర్ల ఎత్తు నుండి ల్యాండ్, టేకాఫ్ చేయగలదని అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల విలువ ప్రకారం 45శాతం స్వదేశీ పరికరాలను కలిగి ఉంది. ఇది సిరీస్ ప్రొడక్షన్ వెర్షన్ కోసం క్రమంగా 55శాతం కంటే ఎక్కువ పెరుగుతుంది. భారత వైమానిక దళం, సైన్యంకు కలిపి 160 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు అవసరమని అంచనా వేసినందున ఫాలోఆన్ ఆర్డర్‌లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆశిస్తోంది.

Delhi Liquor Scam: ఢిల్లీ మొత్తం బడ్జెట్టే రూ.70వేల కోట్లు.. స్కామ్ రూ.1.5లక్షల కోట్లు ఎలా అవుతుంది..?

రక్షణలో పటిష్ఠతను పెంపొందించడానికి రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాలలో వివిధ రకాల ఆయుధాలు, వ్యవస్థలు, మందుగుండు సామగ్రి దిగుమతిని నిషేధించాలని కోరుతూ ప్రభుత్వం యొక్క ‘పాజిటివ్ స్వదేశీ కరణ జాబితా’లో LCH గణాంకాలు ఉన్నాయి. గత రెండేళ్లలో 310 రక్షణ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. 19 నవంబర్ 2021న భారత స్వాతంత్య్రం 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఝాన్సీలో జరిగిన వేడుకల్లో భాగంగా సాయుధ దళాలకు ఎల్‌సిహెచ్‌తో సహా స్థానికంగా ఉత్పత్తి చేసిన మిలటరీ పరికరాలను ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు.