Delhi Liquor Scam: ఢిల్లీ మొత్తం బడ్జెట్టే రూ.70వేల కోట్లు.. స్కామ్ రూ.1.5లక్షల కోట్లు ఎలా అవుతుంది..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోనూ సోదాలు జరిగాయి. తాజాగా లిక్కర్ స్కాంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. లిక్కర్ స్కాం ఏమిటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు.

Delhi Liquor Scam: ఢిల్లీ మొత్తం బడ్జెట్టే రూ.70వేల కోట్లు.. స్కామ్ రూ.1.5లక్షల కోట్లు ఎలా అవుతుంది..?

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోనూ సోదాలు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 25 బృందాలతో ఏకకాలంలో ఈడీ తనిఖీలు చేసింది. సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ క్రమంలో కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లిక్కర్ స్కాంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. లిక్కర్ స్కాం ఏమిటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు. భాజపా నేతల్లో ఒకరు లిక్కర్ స్కాం రూ.1.5లక్షల కోట్లు అని అన్నాడని, ఢిల్లీ మొత్తం బడ్జెట్ రూ.70వేల కోట్లు అయితే.. ఈ స్కామ్ రూ.1.5లక్షల కోట్లు ఎలా అవుతుందంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు .. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో దాడులు

బీజేపీకి చెందిన నేతలు ఒక్కొక్కరు ఒక్కోతీరుగా ఈ స్కాంపై మాట్లాడుతున్నారని అన్నారు. ఒకరు రూ. 1100 కోట్లు స్కాం జరిగిందని అంటున్నాడని, మరికొరు రూ. 8వేల కొట్లని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రూ.144 కోట్లని, సీబీై అధికారులేమో రూ. కోటి లిక్కర్ స్కామ్ జరిగిందని చెబుతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ దాడులు నిర్వహించిందని, కానీ ఒక్కపైసా అక్రమం బయటపడలేదని, అయినా.. ఇక్కడ లిక్కర్ స్కామ్ ఎక్కడఉందో నాకు అర్థం కావటం లేదని కేజ్రీవాల్ అన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు సోమవారంలోగా తేలితే సిసోడియాను అరెస్టు చేయండని, లేకపోతే క్షమాపణలు చెప్పాలని కేజ్రీవాల్ సీబీఐ అధికారులకు, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

MLC Kavitha On ED Notice : టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.. ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం అని ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం రాత్రింబవళ్లూ సీబీఐ, ఈడీతో కాలక్షేపం చేయకుండా దేశానికి సానుకూలంగా కొంత పనిచేయాలని, అలా కాకుండా దర్యాప్తు సంస్థలతో బెదిరిస్తుంటే ఈ దేశం ఎలా పురోగమిస్తుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ మాదిరిగా స్కూళ్లు వంటి సానుకూల అంశాలపై కేంద్రం దృష్టి పెట్టాలని కేజ్రీవాల్ సూచించారు.