28 ఏళ్లు.. 53 బదిలీలు : నిజాయితీకి అవమానం.. అశోక్ ఖేమ్కా ట్వీట్

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 01:16 PM IST
28 ఏళ్లు.. 53 బదిలీలు : నిజాయితీకి అవమానం.. అశోక్ ఖేమ్కా ట్వీట్

Updated On : November 27, 2019 / 1:16 PM IST

28 ఏళ్ల సర్వీసు.. 53 సార్లు ట్రాన్స్‌ఫర్లు.. ఆయనే అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. తాజాగా 53వ సారి బదిలీ అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఉన్నారు. క్రీడా, యువజన వ్యవహారాల విభాగం నుంచి గత మార్చిలో బదిలీ అయిన సంగతి తెలిసిందే.

2019, నవంబర్ 27వ తేదీ బుధవారం బదిలీ విషయంపై ఖేమ్కా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న మరుసటి రోజు బదిలీ చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు రూల్స్, ఆర్డర్స్ ఉల్లంఘించాబడ్డాయని తెలిపారు. 

Read More : నిత్యానంద శిష్యురాలి హత్య : నా బిడ్డను చంపేశారు.. సీబీఐ విచారించాలి
2012లో ఈయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వ్యవహారాలకు సంబంధించి ఖేమ్కా తీసుకున్న నిర్ణయాలు హాట్ హాట్ అయ్యాయి. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య ఒప్పందాన్ని ఆయన రద్దు చేశారు.

అనంతరం అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆరావళి భూ ఏకీకరణ గుంచి ఓ పత్రికతో మాట్లాడిన ఇంటర్వ్యూ ప్రచురితమైన కొన్ని గంటల్లోనే ఆయన బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. అప్పుడు 52వ బదిలీ. విధుల్లో చేరిన నాటి నుంచి నిజాయితీగా పనిచేస్తారనే టాక్ ఉంది.