క్వారంటైన్ నుంచి యువ IAS అదృశ్యం

కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే..స్వీయ నిర్భందమే ఒక్కటే మార్గమమని, క్వారంటైన్ నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇతరులకు వైరస్ సోకితే పెను ప్రమాదం ఏర్పడుతుందని, వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మంచి చదువు చదివి..ఉన్నతమైన..బాధ్యతమైన విధులు నిర్వరిస్తున్న ఓ యువ ఐఏఎస్ ఆఫీసర్ క్వారంటైన్ నుంచి పారిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ సోకిన వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని, దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందదని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.
కొల్లాం సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా మార్చి 18వ తేదీ నుంచి సెలవులపై ఉన్నారు. తిరిగి విధుల్లో చేరారు. సెలవుల్లో మిశ్రా విదేశాలకు వెళ్లారని జిల్లా కలెక్టర్ బి. అబ్దుల్ నాజర్ భావించారు. దీంతో ఇంటిలోనే ఉండాలని నాజర్ ఆదేశాలు జారీ చేశారు. ఇతడిని క్వారంటైన్ కు తరలించారు. ఆరోగ్య కార్యకర్తలు రోజు వారిలాగానే క్వారంటైన్ పరిశీలించారు. ఈ సమయంలో ఐఏఎస్ అధికారి మిశ్రా కనిపించలేదని గ్రహించారు.
ఇతను యూపీలో ఉన్నట్లు తేలింది. దీనిపై తమకు సమాచారం ఇవ్వకుండా..వెళ్లిపోయాడని, చాలా తీవ్రంగ పరిగణించాల్సిన విషయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. మిశ్రాను గుర్తించడానికి యూపీలోని అధికారులతో మాట్లాడుతున్నారన్నారు. కానీ లాక్ డౌన్ కొనసాగుతున్నా..ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా వెళ్లాడనే దానిపై సమాచారం లేదు. ఇతనిపై కేసు నమోదు చేశారు.
Also Read | బ్రహ్మకుమారీస్ చీఫ్ కన్నుమూత…ప్రధాని సంతాపం