ICMR..Male Contraceptive : పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్ .. ఐసీఎంఆర్ ఘనత

ఐసీఎంఆర్ పరిశోధనలకు ప్రతిఫలంగా పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా సురక్షితమని వెల్లడించింది.

ICMR..Male Contraceptive : పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్ .. ఐసీఎంఆర్ ఘనత

ICMR..World Fist Male Contraceptive

Updated On : October 20, 2023 / 1:21 PM IST

ICMR..World Fist Male Contraceptive : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రపంచంలోనే మొట్టమొదటిగా మగవారికి గర్భనిరోధక ఇంజెక్షన్ ను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసింది. మగవారి కోసం అభివృద్ధి చేసిన ఈ గర్భనిరోధక ఇంజెక్షన్ పూర్తిగా సురక్షితమని వెల్లడించింది.ఈ ఇంజెక్షన్ 97.3 శాతం సురక్షితమైనది వెల్లడించింది.

ఐసీఎంఆర్ ఏడేళ్లపాటు చేసిన పరిశోధనలకు ప్రతిఫలంగా ఈ ఇంజెక్షన్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా సురక్షితమని 25-40 సంవత్సరాల వయస్సు కలిగిన 303 మంది పురుషలపై జరిపిన పరిశోధనల తరువాత ఐసీఎంఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఐసీఎంఆర్ అధ్యయన ఫలితాలు ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ ఆండ్రాలజీలో ప్రచురితమయ్యాయి. ఈ ఇంజెక్షన్ కు
సుధీర్ఘకాలం పాటు అవాంఛిత గర్భాన్ని అడ్డుకునే రివర్సిబిలిటీ ఉండడం మరో విశేషం.

పరిశోధనల్లో 25-40 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్ధులకు 60 మిల్లీ గ్రాముల ఆర్ఐఎస్‌యూజీ (రివెర్సిబుల్ ఇన్‌హిబిటేషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్)ను ఇచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఇంజెక్షన్ 99.02 శాతం గర్భాన్ని అడ్డుకుంటున్నట్లుగా గుర్తించామన్నారు. ఇది పూర్తిగా సురక్షితమని..ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని వివరించారు. ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి వస్తే మగవారికి వేసెక్టమీ లేదా నో స్కాల్పెల్ వాసెక్టమీ చేయించుకునే ‘కోత’లు తప్పినట్లే.

కాగా..ఈ ఇంజెక్షన్ కు సంబంధించి క్రిలనికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI) అనుమతిని మంజూరు చేసింది. దీంతో ఐసీఎంఆర్ న్యూ ఢిల్లీ,ఉధంపూర్, లూథియానా,జైపూర్, ఖరగ్ పూర్ కేంద్రాలలో నిర్వహించారు.