Ration Home Delivery: పిజ్జా, బర్గర్‌లకు కుదిరిన డెలివరీ సర్వీస్ రేషన్‌కు కుదరదా..

Ration Home Delivery
Ration Home Delivery: రేషన్ డోర్ డెలివరీ సర్వీసును కేంద్రం నిలిపేసిన మరుసటి రోజే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేషన్ మాఫియాకు ప్రభావితమై కేంద్రం వెనకడుగేసిందని అన్నారు. పేదలకు ఉపయోగపడే స్కీమ్ ను దేశ రాజధానిలో అమలు చేయలేకపోతున్నామని అన్నారు.
డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీం మొదలుకావడానికి రెండ్రోజులు ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. పిజ్జా, బర్గర్లు, స్మార్ట్ ఫోన్లు, బట్టలు ఇంటికి డెలివరీ ఇవ్వగలిగినప్పుడు రేషన్ వారి ఇళ్లకు వెళ్లి ఇవ్వలేరా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తొలిసారి ప్రభుత్వం రేషన్ మాఫియాను అడ్డుకోవడానికి నిర్ణయం తీసుకుంది. వాళ్లెంత పవర్ ఫుల్ గా ఉన్నారంటే.. అమలు కావడానికి ఇంకా కొద్దిరోజులు ఉండగానే స్కీం క్యాన్సిల్ అయ్యేలా చేశారు.
డిజిటల్ ప్రెస్ కాన్ఫిరెన్స్ కు హాజరైన కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడానికి కేంద్రం నుంచి అప్రూవల్ రావాల్సిన అవసరం లేదు. కానీ, వాదనలేమీ లేకుండా చూసుకునేందుకు ఐదు సార్లు పర్మిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం.
ఈ డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీం కింద ఢిల్లీలో 72లక్షల మందికి రేషన్ బెనిఫిట్ పొందుతారు. కేంద్రం ప్రతి ఒక్కరితో ఘర్షణ పడుతుంది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్ ప్రభుత్వాలతో పాటు లక్ష్యద్వీప్ ప్రజలు, రైతులతతో కూడా వివాదం పెట్టుకుందని అన్నారు.