ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి మాస్క్‌లు తయారీ..

  • Published By: nagamani ,Published On : June 8, 2020 / 09:25 AM IST
ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి మాస్క్‌లు తయారీ..

Updated On : June 8, 2020 / 9:25 AM IST

ప్లాస్టిక్ ఈ పేరు చెబితేనే పర్యావరణవేత్తలు మండి పడుతుంటారు. పర్యావరణానికి తీవ్ర హాని చేసే ప్లాస్టిక్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. కానీ ఈ కరోనా కాలంలో ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి అత్యంత నాణ్యమైన మాస్కులను తయారు చేశారు సైంటిస్టులు. ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయంటున్నారు.  ఒక్క మాస్క్ ధర కేవలం రూ.25 అంటున్నారు. అంతేకాదు ఈ మాస్కులను 30 సార్లు వాడుకోవచ్చంటున్నారు. 

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండిలోని సైంటిస్టులు ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి అత్యంత నాణ్యమైన మాస్కులను తయారుచేసే సాంకేతికతను ఐఐటీ మండి శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఈ మాస్కుల తయారీ కోసం పరిశోధకులు ముందుగా ప్లాస్టిక్‌ బాటిళ్లను చిన్న ముక్కలుగా చేశారు. ఆ తరువాత వాటిని ఓ ప్రత్యేక ద్రావణంలో కరిగించి నానోఫైబర్స్‌ను వెలికితీశారు. 

వాటి ద్వారా అత్యంత సన్నని పొరను అభివృద్ధి చేసి దాని నుంచి మాస్కులను తయారు చేశారు. ఈ మాస్కుల వల్ల గాలి పీల్చుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని ఐఐటీ సైంటిస్టులో ఒకరైన అశిష్కకోరియా  తెలిపారు. ల్యాబ్‌లో దీని తయారీకి రూ. 25 ఖర్చు అవుతుందని, కమర్షియల్‌గా అయితే సగం ధరకే లభిస్తుందని చెప్పారు. ఈ మాస్కులను 30సార్లు కడిగి తిరిగి వాడుకోవచ్చని తెలిపారు. 

కాగా..ఇవి నిపుణుల ద్వారా తయారు చేయబడినవే తప్ప ఎవరికి వారు ఇంటిలో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేసుకుని వాడేసుకోకూడదు. దీనికి సరైన ప్రక్రియద్వారానే మాస్కులను తయారు చేసినవనీ..అంతే తప్ప ప్రజలు స్వంత ప్రయోగాలు చేసుకోకూడదని గమనించాలి.  మిడి మిడి జ్నానంతో ఎటువంటి ఆపదలు కొనితెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Read: క్వారంటైన్ కేంద్రంలో దారుణం, యువతితో అసభ్య ప్రవర్తన