ఏం టేస్ట్ గురూ : లక్షలొచ్చే జీతం కాదని రైల్వే ట్రాక్ మెన్ అయిన ఐఐటీ విద్యార్థి

ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి, మెంటాలిటీ. అందరూ ఒకేలా ఉండరు. కొందరు కాలంతో పాటు వేగంగా పరిగెత్తాలని, లక్షలు, కోట్లు సంపాదించాలని అనుకుంటారు. కొందరు.. జీతం

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 02:53 PM IST
ఏం టేస్ట్ గురూ : లక్షలొచ్చే జీతం కాదని రైల్వే ట్రాక్ మెన్ అయిన ఐఐటీ విద్యార్థి

Updated On : August 26, 2019 / 2:53 PM IST

ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి, మెంటాలిటీ. అందరూ ఒకేలా ఉండరు. కొందరు కాలంతో పాటు వేగంగా పరిగెత్తాలని, లక్షలు, కోట్లు సంపాదించాలని అనుకుంటారు. కొందరు.. జీతం

ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి, మెంటాలిటీ. అందరూ ఒకేలా ఉండరు. కొందరు కాలంతో పాటు వేగంగా పరిగెత్తాలని, లక్షలు, కోట్లు సంపాదించాలని అనుకుంటారు. కొందరు.. జీతం తక్కువైనా పర్లేదు.. జాబ్ సెక్యూరిటీ, సంతృప్తి ఉండాలని కోరుకుంటారు. ఆ కుర్రాడు ఈ రెండో కోవకే వస్తాడు. ఉన్నత చదువులు చదివిన అతడు తలుచుకుంటే మంచి ఉద్యోగం, లక్షల్లో సాలరీ, లగ్జరీ లైఫ్, ఏసీ గదుల్లో పని. కానీ అవన్నీ కాదనుకుని తక్కువ జీతమొచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. అది కూడా తక్కువ స్థాయి విభాగంలో చేరాడు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబేలో చదివి ఇప్పుడు రైల్వేలో ట్రాక్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 

వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పట్నాకు చెందిన శ్రవణ్‌ కుమార్‌ 2010లో ఐఐటీ బాంబేలో చేరాడు. బీటెక్‌, ఎంటెక్‌ పట్టా పొందాడు. ప్రభుత్వ ఉద్యోగి కావాలన్నది అతడి టార్గెట్. చదువు పూర్తవగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. తనతో పాటు చదువుకున్న ఐఐటీ స్నేహితులు పేరున్న కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. శ్రవణ్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగాడు.

ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన గ్రూప్‌ డీ పరీక్షలో శ్రవణ్ పాస్ అయ్యాడు. ట్రాక్ మెయింటెనర్‌(ట్రాక్‌మన్‌)గా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం ధన్‌బాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని చంద్రపురాలో విధులు నిర్వహిస్తున్నాడు. మల్టీ నేషనల్ కంపెనీలో కొలువు, లక్షల్లో జీతం, విలాసవంతమైన సౌకర్యాలు.. ఇవన్నీ కాదని.. ఇలాంటి జాబ్ ఎందుకు ఎంచుకున్నావు అని అడిగితే.. ఉద్యోగ భద్రత ఉంటుందనే కారణంతోనే తాను రైల్వేల్లో చేరినట్లు శ్రవణ్‌ చెబుతున్నాడు. జాబ్ చిన్నదా పెద్దదా.. జీతం తక్కువా ఎక్కువా.. అనే విషయాలు తాను పట్టించుకోను అన్నాడు. తనకు కావాల్సింది జాబ్ సెక్యూరిటీ, సంతృప్తి. అందుకే తాను ప్రభుత్వం ఉద్యోగంలో చేరాను అని వివరించారు. ఎప్పటికైనా ప్రభుత్వ రంగంలో ఉన్నతస్థాయి అధికారి అవుతానని శ్రవణ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

శ్రవణ్ తీరు తెలిసి తోటి స్నేహితులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎవరి టేస్ట్ వారిది అని కామెంట్ చేస్తున్నారు. శ్రవణ్ గురించి తెలిసి అతడి స్నేహితులే కాదు.. నెటిజన్లు కూడా వండర్ అవుతున్నారు. సర్కారీ కొలువుకి ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి శ్రవణ్ ఉదంతమే నిదర్శనం అంటున్నారు. ఎంతైనా ప్రభుత్వం ఉద్యోగానికి మరే ఉద్యోగమూ సాటి రాదని అంటున్నారు.

Also Read : నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు రద్దు