IMA Protest : జూన్-18న దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన
దేశవ్యాప్త నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్దమైంది.

Ima
IMA Protest వైద్యులపై దాడులకు పాల్పడిన వివిధ సంఘటనలపై దేశవ్యాప్త నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్దమైంది. హింసాకాండ నుంచి డాక్టర్లను రక్షించడానికి కేంద్రం ఓ చట్టం తీసుకురాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం(జూన్-18,2021) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా,అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా,మెడికల్ స్టూడెంట్స్ నెట్ వర్క్,జూనియర్ డాక్టర్ నెట్ వర్క్(JDN)వంటి సంస్థలు నిరసన్లో పాల్గొంటాయని ఐఎంఏ తెలిపింది.
హాస్పిటల్స్ ను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల మంది వైద్యులు పాల్గొంటారని ఐఎంఎ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ తెలిపారు.