CM Bhagwant Mann : చండీగఢ్‌‌ను ఇచ్చేయండి.. పంజాబ్ సీఎం డిమాండ్

1966లో నవంబర్ 01న హర్యానా రాష్ట్రం ఏర్పడడంతో చండీగఢ్ నగరం మధ్యలో ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. పంజాబ్ - హర్యానాల సంయుక్త రాజధానిగా...

CM Bhagwant Mann : చండీగఢ్‌‌ను ఇచ్చేయండి.. పంజాబ్  సీఎం డిమాండ్

Punjab

Updated On : April 1, 2022 / 3:53 PM IST

Immediate Transfer Of Chandigarh To Punjab : పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయానికి తెరలేపారు. చండీగఢ్ నగరాన్ని పంజాబ్ రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏకంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి.. తీర్మానం చేశారు. చండీగఢ్ పై సర్వ హక్కులు తమయే.. వెంటనే దానిని వెనక్కి ఇచ్చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి హర్ పాల్ సింగ్ చీమా మద్దతు ప్రకటించారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం.

Read More : Bhagwant Mann : పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

గతంలో సభలో ఇలాంటి తీర్మానాలు ఎన్ని చేసినా.. లాభం లేకుండా పోయిందని.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని.. దీనిని సాధించి తీరుతామని అసెంబ్లీలో ప్రకటించారు. పంజాబ్ సర్వీసు రూల్స్ కు బదులు చండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీసు రూల్స్ వర్తిస్తాయని ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనికి కౌంటర్ గా పంజాబ్ కు పూర్తి రాజధాని చండీగఢ్ ఉండాలంటూ సీఎం భగవంత్ మాన్ తీర్మానం ప్రవేశ పెట్టడం విశేషం. ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని వెంటనే చండీగఢ్ ను పంజాబ్ కు బదిలీ చేయాలని తీర్మానంలో వెల్లడించారు.

Read More : Bhagwant Mann : తగ్గేదేలే…అంటున్న పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్‌

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత…కేంద్రంతో గొడవ పడింది ఆప్. ప్రస్తుతం అదే సీన్ పంజాబ్ లో కూడా రిపీట్ చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. 1966 లో హిందీ భాష మాఠ్లాడే వారితో ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రం ఏర్పాటైన సంగతి తెలిసిందే. పూర్వ పంజాబ్ ను విభజించారు. చండీగఢ్ ఉత్తర భారతదేశంలోని ఒక నగరం. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటోంది. అయితే.. ఈ రెండింటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం విశేషం.

Read More : Bhagwant Mann : సీఎంగా భగవంత్ మాన్ దాస్ ప్రమాణ స్వీకారం.. డేట్ ఫిక్స్

1966లో నవంబర్ 01న హర్యానా రాష్ట్రం ఏర్పడడంతో చండీగఢ్ నగరం మధ్యలో ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. పంజాబ్ – హర్యానాల సంయుక్త రాజధానిగా కొనసాగుతోంది. విభజన జరిగిన సమయంలో… రాజధాని మాతృ రాష్ట్రానికే చెందాలని ఆప్ ప్రస్తుతం డిమాండ్ చేస్తోంది. ప్రస్తుం చండీగఢ్ పై సర్వ హక్కులు తమవేనని, పూర్తిగా పంజాబ్ కు ఇచ్చేయాలని సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేయడంతో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.