Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారి-వాట్సప్ ద్వారా కేసు విచారించిన న్యాయమూర్తి

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక న్యాయమూర్తి వాట్సప్ ద్వారా కేసు   విచారించి తీర్పు చెప్పిన ఘటన తమిళనాడులోని  చెన్నై హైకోర్టులో చోటు చేసుకుంది.

Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారి-వాట్సప్ ద్వారా కేసు విచారించిన న్యాయమూర్తి

Madras High Court

Updated On : May 17, 2022 / 10:18 AM IST

Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక న్యాయమూర్తి వాట్సప్ ద్వారా కేసు   విచారించి తీర్పు చెప్పిన ఘటన తమిళనాడులోని  చెన్నై హైకోర్టులో చోటు చేసుకుంది. ఈ విచారణను జస్టిస్ జీఆర్ స్వామినాధన్ చేపట్టారు. ప్రస్తుతం చెన్నై హై కోర్టుకు సెలవులున్నాయి. ఈ క్రమంలో అత్యవసర పిటీషన్లు వచ్చినప్పడు విచారించేందుకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు.

మద్రాస్ హై కోర్టు న్యాయమూర్తి స్వామినాథన్ ఆదివారం ఒక వివాహా వేడుక  కోసం నాగర్ కోయిల్ వెళ్ళారు. అక్కడి నుంచే  కేసును వాట్సప్ ద్వారా విచారించారు.  తమిళనాడు లోని ధర్మపురి జిల్లా పాపరపట్టిలో అభీష్టవరదరాజ స్వామి రథయాత్ర గతంలో జరిగింది. అర్ధరాత్రి  జరిగిన ఆ వేడుకల్లో రథానికి విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటలో 11 మంది భక్తులు మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు.

ఈ ఏడాది సోమవారం జరగాల్సిన రథోత్సవం నిర్వహించవద్దని దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చింది. వాటిని  నిలిపివేయాలని ఆలయ ధర్మకర్త   పీఆర్ శ్రీనివాసన్ హై కోర్టులో  అత్యవరసర పిటషన్ దాఖలు చేశారు.  రథయాత్ర నిర్వహించకపోతే దైవానికి ఆగ్రహం వస్తుందని అభ్యర్ధించారు. శ్రీనివాసన్ పిటీషన్ మేరకు జస్టిస్ స్వామి నాధన్ వాట్సప్ లో కేసు విచారించేందుకు సిధ్దమయ్యారు.

న్యాయమూర్తితో పాటు పిటీషన్‌దారు, ఆయన తరుఫు న్యాయవాది, ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ ఆర్.షణ్ముగ సుందరం నలుగురు వేర్వేరు ప్రాంతాలనుంచి వాట్సప్ వీడియో కాల్‌లోకి   వచ్చి తమ వాదనలు వినిపించారు. ఈక్రమంలో ప్రభుత్వ  ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

రథయాత్రను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆలయ కమిటీ ప్రజల భద్రతకు ఎక్కున ప్రాధాన్యం ఇవ్వాలని… రథయాత్ర జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : Honey Trap : హానీట్రాప్‌ వల్లే బీజేపీ నాయకుడి ఆత్మహత్య ?