Dheeraj Sahu: అఫిడవిట్‭లో 27 లక్షలే, కానీ అల్మారాలో 225 కోట్లు.. కరప్షన్ కింగ్, కాంగ్రెస్ ఎంపీ గురించి తెలుసుకోండి

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఇంటి నుంచి సుమారు 225 కోట్ల రూపాయలను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది.

Dheeraj Sahu: అఫిడవిట్‭లో 27 లక్షలే, కానీ అల్మారాలో 225 కోట్లు.. కరప్షన్ కింగ్, కాంగ్రెస్ ఎంపీ గురించి తెలుసుకోండి

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఇంటి నుంచి సుమారు 225 కోట్ల రూపాయలను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. ఆయన తన అఫిడవిట్‭లో కేవలం 27 లక్షల నగదు మాత్రమే ఉందని రాశారు. కానీ అల్మారా చూస్తే కోట్ల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. ఇంత పెద్ద మొత్తం లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖ తల మీదకొచ్చింది. లెక్కిస్తుంటే టాలర్ మిషిన్లు పాడైపోతున్నాయని అధికారులు చెప్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించడం ఇదే మొదటిసారి. పైగా సాహూ వద్ద లభించిన నోట్లన్నీ కొత్త నోట్లే కావడం గమనార్హం.

3 రోజులుగా ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్స్
ఆదాయపు పన్ను శాఖకు చెందిన 40 మంది సభ్యుల బృందం జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణాలపై దాడులు చేస్తోంది. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ దాడిలో ఇప్పటి వరకు ఎంపీకి చెందిన పలు ప్రాంతాల్లో రూ.225 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ చోట అల్మారాలో కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. ఒడిశాలోని ధీరజ్ సాహుకు చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు చేసింది. ఇది కాకుండా ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్.. జార్ఖండ్‌లోని రాంచీ-లోహర్‌దగా.. కోల్‌కతాలో కూడా దాడులు జరిగాయి. ధీరజ్ సాహు రహస్య స్థావరాల్లో దొరికిన నిధి ఎంతగా ఉందంటే, దాన్ని లెక్కించేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాదాపు 40 యంత్రాలను పిలిపించాల్సి వచ్చింది. డబ్బులను లెక్కించేటప్పుడు చాలా యంత్రాలు పని చేయకుండా ఆగిపోయాయి. ఆదాయపు పన్ను అధికారి నగదును 156 బ్యాగుల్లో నింపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు తరలించారు.

అఫిడవిట్‌లో 27 లక్షలే
ధీరజ్ సాహు 2010 నుంచి జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఈరోజు ఆయన రహస్య ప్రదేశాల నుంచి దాదాపు రూ.225 కోట్ల నగదు పట్టుబడింది. అయితే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో రూ.8.89 కోట్ల ఆస్తిని ప్రకటించారు. 15 లక్షల నగదు ఖాతాలో జమ చేశారు. భార్య, వారిపై ఆధారపడిన వారితో సహా మొత్తం కుటుంబం వద్ద కేవలం రూ.27.50 లక్షల నగదు మాత్రమే ఉందన్నారు. అయితే, ఈ లెక్కన ధీరజ్ సాహుపై ఈడీ చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. ఈ డబ్బుకు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం ఉందన్న అనుమానంతో ఒడిశాలోని ఈడీ జోనల్ కార్యాలయం విచారణకు ఆదేశించింది.

ధీరజ్ సాహు ఎవరు?
23 నవంబర్ 1959న రాంచీలో జన్మించిన ధీరజ్ సాహూ రాజ్యసభ ఎంపీ. అలాగే వ్యాపారవేత్త. మద్యం వ్యాపారి కూడా. ఆయన జార్ఖండ్‌లోని లోహదర్గా నివాసి, మాజీ ఎంపీ శివప్రసాద్ సాహు సోదరుడు. శివప్రసాద్ సాహు రెండుసార్లు రాంచీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. బీహార్‌లోని ఛోటానాగ్‌పూర్‌లో జన్మించిన ధీరజ్ సాహు తండ్రి రాయ్ సాహెబ్ బల్దేవ్ సాహు స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాహు కుటుంబం కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉంది. ఆయన తల్లి పేరు సుశీలా దేవి. 1977లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధీరజ్, బీఏ పూర్తి చేసిన తర్వాత మొదట యూత్ కాంగ్రెస్‌లో చేరారు. సాహు మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2009లో తొలిసారిగా, 2010 జూలైలో, ఆ తర్వాత మే 2018లో రాజ్యసభకు చేరుకున్నారు.