India-China: వెనక్కి తగ్గిన చైనా.. తూర్పు లద్దాఖ్ నుంచి సైనిక బలగాలు ఉపసంహరణ.. మరో నాలుగు రోజుల్లో పెట్రోలింగ్ షురూ

తూర్పు ల‌డ‌ఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్ - చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ..

India-China: వెనక్కి తగ్గిన చైనా.. తూర్పు లద్దాఖ్ నుంచి సైనిక బలగాలు ఉపసంహరణ.. మరో నాలుగు రోజుల్లో పెట్రోలింగ్ షురూ

Eastern Ladakh sector

Updated On : October 25, 2024 / 10:21 AM IST

India-China dispute: భారత్ – చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు ల‌డ‌ఖ్‌లో దాదాపు నాలుగేళ్లు సైనిక ప్రతిష్టంభనను ముగించడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. తూర్పు లద్దాఖ్ సెక్టార్ లోని కీలక ప్రాంతాలైన డెస్సాంగ్, డెమ్చోక్ నుంచి కొన్ని తాత్కాలిక సైనిక స్థావరాలను, తాత్కాలిక నిర్మాణాలను ఇరు దేశాలు తొలగిస్తున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. బలగాల ఉపసంహరణ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత మరో నాలుగైదు రోజుల్లో ఈ రెండు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను పునరుద్దరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: US Elections 2024: మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు షాకిచ్చిన నోబెల్ గ్రహీతలు

తూర్పు ల‌డ‌ఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్ – చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇరవై మందికిపైగా భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఎల్ఏసీ వెంబడి ఇరు దేశాలు భారీగా సైనిక బలగాలను మోహరించాయి. అక్కడ తాత్కాలిక నిర్మాణాలు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాయి. ఎల్ఏసీ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక అధిపతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు.

Also Read: ఇరాన్ అర్మాన్‌ వర్సెస్ ఇజ్రాయెల్‌ థాడ్‌..! పశ్చిమాసియాలో ఇక రక్తపాతమేనా?

ఇరుదేశాల మధ్య ఇటీవల ఒప్పదం కుదిరింది. రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఒప్పందాన్ని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ధ్రువీకరించారు. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి 2020 గల్వాన్ ఘర్షణకు ముందు నాటి యథాస్థితి కొనసాగనుంది. ఇక నుంచి 2020లో గస్తీ నిర్వహించిన సైనికులు పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు.