అమెరికా నుంచి రూ.32,000 కోట్లతో 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్

భారత సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి ప్రిడేటర్ డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి.

అమెరికా నుంచి రూ.32,000 కోట్లతో 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్

Updated On : October 15, 2024 / 2:26 PM IST

Predator drones: అమెరికా నుంచి రూ.32,000 కోట్లతో 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు కోసం ఆ దేశంతో భారత్ ఇవాళ ఒప్పందం చేసుకుంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం వీడిని వాడతారు. ఇరు దేశాల అధికారుల సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.

భారత్‌లో ఆ డ్రోన్ల మెయింటెనెన్స్, రిపేర్, సమగ్ర సదుపాయాల కోసం ఈ ఒప్పందం జరిగింది. భారత సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి ప్రిడేటర్ డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి. ఈ ఫారిన్ మిలిటరీ సేల్స్ ఒప్పంద కాంట్రాక్టుల కోసం అమెరికా బృందం భారత్‌కు వచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు.

ఇటీవలే భారత భద్రతా వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోళ్లకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్లలో 15 నావికా దళానికి, మిగతావి వైమానిక, ఆర్మీకి వెళ్తాయి. అమెరికాతో ఈ ఒప్పందం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు జరిగాయి. కొన్నివారాల క్రితం అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి.

డెలావేర్‌లో జరిగిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా డ్రోన్‌ల కొనుగోలుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చర్చలు జరిపిన నెలలోపే ఈ ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంక్యూ-9బీ ప్రిడేటర్లు నిశ్శబ్దంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తాయి. దాని స్టెల్త్ ఫీచర్ మిగతా డ్రోన్లకు ఉండదు. ఈ డ్రోన్ భూమి నుంచి 250 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంటుంది.

Video: ఛాతీపై రతన్ టాటా ముఖాన్ని టాటూగా వేయించుకున్న యువకుడు.. ఎందుకంటే?