అత్యవసర పరిస్థితుల్లో కరోనా కు”రెమ్ డిసివర్” వాడొచ్చు

  • Published By: venkaiahnaidu ,Published On : June 2, 2020 / 03:38 PM IST
అత్యవసర పరిస్థితుల్లో కరోనా కు”రెమ్ డిసివర్” వాడొచ్చు

Updated On : June 2, 2020 / 3:38 PM IST

కోవిడ్-19 రోగుల‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో అమెరికన్ కంపెనీ  గిలీడ్ సైన్సెస్ తయారుచేసిన యాంటీవైరల్ డ్రగ్ “రెమ్‌డిసివిర్” వాడేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లో ఈ ఔష‌ధాన్ని వినియోగించేందుకు జూన్ 1న అనుమతులిచ్చామని, అయితే పేషెంట్ కు ఐదు డోసులు మాత్ర‌మే ఇవ్వాలని అని డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జెన‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అధికారిక క్లినికల్ ట్రయిల్స్ లో కరోనా పేషెంట్లపై ఈ మందు  మెరుగైన ప్ర‌భావం చూపిన‌ట్లు తేలింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మరియు జపానీస్ హెల్త్ రెగ్యులేటర్స్ కూడా గత నెలలో రెమ్ డిసివర్ ను కోవిడ్-19 రోగుల‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ఉపయోగించేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు ఈ ఔషధాన్ని 5 రోజులు వినియోగించడం వల్ల కొంత ప్రభావం చూపుతోందని రెమెడిసివిర్ తయారీ సంస్థ గిలీడ్ కంపెనీ తెలిపింది.

యాంటీవైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌కు పేటెంట్‌ కలిగిన గిలియడ్‌ సైన్సెస్‌ ఇటీవల దేశీ ఫార్మా రంగ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, హెటెరో ల్యాబ్స్‌తో నాన్‌ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాలను చేసుకుంది. ఫ‌లితంగా ఈ కంపెనీలు రెమ్‌డిసివిర్‌ను దేశీయంగా త‌యారు చేసి అందుబాటులోకి తేనుంది. వాస్తవానికి ఈ యాంటీవైరల్ డ్రగ్…ఎబోలా ట్రీట్మెంట్ కు ఉద్దేశించబడినది,కానీ అది విజయవంతం కాలేదు. ఇప్పుడు కరోనా రోగులకు బాగా పనిచేస్తుంది.