1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది

పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత్.. ధీటుగా సమాధానం చెప్పింది. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా క్యాంపులపై దాడులు చేసింది. ఇందులో భారత ఎయిర్ ఫోర్స్ బలగాలు 12 మిరాజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉపయోగించి 1000కిలోల బాంబులను ప్రయోగించారు.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి
1971 తర్వాత ఇన్నేళ్ల వరకూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిపోలేదు. చివరికి 1999వ సంవత్సరంలో కార్గిల్ వార్ జరుగుతున్న సమయంలోనూ సరిహద్దుల్లో నుంచే యద్ధం చేశారు. ఈ సారి చికోటి, ముజఫ్ఫరాబాద్ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి బాలాకోట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిక్షణా క్యాంపులపైనా దాడులు చేశారు. ఇంకోలా చెప్పాలంటే భారత్ సరిహద్దు దాటి దాడి చేయలేదు.. పాకిస్తాన్‌పై దాడి చేసినట్లే.
పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ.. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాక్‌లోకి చొరబడ్డాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బలగాలు దాడిని తిప్పి కొట్టడంతో వెనుదిరిగాయి అంటూ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఎర్) డైరక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
Also Read : ప్రపంచానికి ముందే చెప్పాం.. పాక్ ప్రధాని అత్యవసర సమావేశం
భారత యుద్ధ విమానాలు తిరిగి వెళ్లిపోతూ ఖైబర్ పక్తున్‌క్వాలోని బాలాకోట్ ప్రాంతంలో బాంబులు విసిరి వెళ్లిపోయాయి. ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లపై పాక్ నిషేదిత ఉగ్రవాద గ్రూపు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.