India S-400 Missiles : చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ ఎస్-400 క్షిపణుల మోహరింపు…ఎందుకంటే?

భారత వైమానిక దళం సరిహద్దుల్లో క్షిపణులను మోహరించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రక్షణ కోసం వైమానిక దళం అప్రమత్తమైంది. చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా మూడు ఎస్-400 క్షిపణులను మోహరించింది....

India S-400 Missiles : చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ ఎస్-400 క్షిపణుల మోహరింపు…ఎందుకంటే?

India Deploys S-400 Missile

Updated On : October 31, 2023 / 10:48 AM IST

India S-400 Missiles : భారత వైమానిక దళం సరిహద్దుల్లో క్షిపణులను మోహరించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రక్షణ కోసం వైమానిక దళం అప్రమత్తమైంది. చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా మూడు ఎస్-400 క్షిపణులను మోహరించింది. మరో రెండు క్షిపణులను మోహరించడం గురించి చర్చించడానికి భారత్,రష్యా అధికారులు త్వరలో సమావేశం కానున్నారు.

Also Read :  Mukesh Ambani : ముకేశ్ అంబానీకి మూడో సారి బెదిరింపు…ఈ సారి రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్

రష్యా దేశం నుంచి ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు 2018-19వ సంవత్సరంలో భారతదేశం 35వేల కోట్లరూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా క్షిపణుల కొనుగోలుకు ఆటంకం కలిగింది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో మరో రెండు క్షిపణులను మోహరించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు నిర్ణయించాయి.

Also Read : Onion Prices : దేశంలో ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు…తెరవెనుక కథ

భారతదేశం లాంగ్ రేంజ్ సర్పేస్ ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ను కొనుగోలుకు ఇటీవల భారత డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మూడు-లేయర్డ్ లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలు, క్షిపణులను కూల్చివేయగలదు.

Also Read : Varun lavanya : వరుణ్ లావణ్య పెళ్లి ముహూర్తం.. ఏ రోజు ఎన్ని గంటలకు..? ఫుల్ డీటెయిల్స్..