Minister Jaishankar: ఇతరులకు చెప్పే అర్హత మీకుందా? ఐక్యరాజ్య సమితిలో పాక్, చైనాలపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి జైశంకర్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ - సంస్కరణలపై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జైశంకర్ పాకిస్థాన్ కు ధీటైన సమాధానం ఇచ్చాడు. ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించి, తమ పొరుగు దేశ పార్లమెంటు‌పై దాడిచేసిన వారు ఈ వేదికపై ప్రసంగించలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Minister Jaishankar: ఇతరులకు చెప్పే అర్హత మీకుందా? ఐక్యరాజ్య సమితిలో పాక్, చైనాలపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి జైశంకర్

Minister Jaishankar

Updated On : December 15, 2022 / 11:17 AM IST

Minister Jaishankar: ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయి. అలాంటి వారికి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఇతర దేశాలకు ప్రబోధించే అర్హత ఉందా? అంటూ పరోక్షంగా చైనా, పాకిస్థాన్ దేశాలను ఉద్దేశించి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చా కార్యక్రమంలో జై.శంకర్ పాల్గొని మాట్లాడారు. పనిలో పనిగా పాకిస్థాన్ పై పరోక్షంగా మాటలతో మంత్రి ఎదురుదాడి చేశారు.

Jaishankar In Saudi: సౌది అరేబియా రాజుతో సమావేశమైన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ – సంస్కరణలపై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జైశంకర్ పాకిస్థాన్ కు ధీటైన సమాధానం ఇచ్చాడు. ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించి, తమ పొరుగు దేశ పార్లమెంటు‌పై దాడిచేసిన వారు ఈ వేదికపై ప్రసంగించలేరని అన్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయని పాక్, చైనా సంబంధాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా జైశంకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదం, శత్రుత్వం, హింసకు తావులేని వాతావరణంలో మాత్రమే తాము పాకిస్థాన్ తో సంబంధాలను కోరుకుంటున్నామని జైశంకర్ ఐక్యరాజ్య సమితి వేదికగా స్పష్టం చేశారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని అన్నారు. ఈ వాస్తవాన్ని పాక్ అంగీకరించి భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలంటూ సూచించారు.