పాక్‌పై ప్రతీకారం : వస్తువులపై 200% పన్ను పెంపు

పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ పై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని ఆర్థిక మంత్రి జైట్లీ ట్విట్టర్‌లో ప్రకటించారు.
పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, తదితరాలున్నాయి. ప్రస్తుతం పండ్ల పై 50% వరకు, సిమెంట్ పై 7.5% కస్టమ్స్ డ్యూటీ ఉంది. దీంతోపాటు తాజా చర్యతో భారత్‌లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ‘పుల్వామా దాడికి ఆ దేశమే కారణమని భావిస్తూ..గతంలో పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్యతా గల దేశం (MFN) హోదాను భారత్ ఉపసంహరించుకుంది.