భారత్ హిందూ దేశం కాదు..బీజేపీపై ఓవైసీ ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : September 4, 2019 / 01:37 PM IST
భారత్ హిందూ దేశం కాదు..బీజేపీపై ఓవైసీ ఫైర్

Updated On : September 4, 2019 / 1:37 PM IST

ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్,బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియను తప్పుబడుతూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఎన్ఆర్సీ జాబితా విడుదలైన తర్వాత దాదాపు 19లక్షల మంది అస్సాంలో నివసిస్తున్నవాళ్లు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని యన అన్నారు. ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టడానికి ఎన్ఆర్సీని ఉపయోగించుకుంటున్నారన్నారు.

ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ ఫైర్ అయ్యారు. ఏదేమైనా హిందువులు రక్షించడబతారని అన్నారు. నమ్మకాల ఆధారంగా ప్రజలను విభజించకూడదన్నారు. భారత్ హిందువులను రక్షించకపోతే మరెవరు రక్షిస్తారని ఆయన అన్నారు. పాకిస్తాన్ హిందువులను రక్షిస్తుందా అని శర్మ ప్రశ్నించారు. హింసించబడ్డ హిందువులకు భారత్ ఎప్పుడూ ఇల్లుగా ఉండాలంటూ శర్మ కౌంటర్ ట్వీట్ చేశారు.

అయితే శర్మ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ మరో ట్వీట్ చేశారు. భారతదేశంలో హిందువులనే కాకుండా భారతీయులందరినీ రక్షించాలని, మన దేశంలో అన్ని మతాలను, జాతులను, కులాలను సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. మతం పౌరసత్వానికి ఆధారం కాదన్నారు. ఇది హిందూ దేశం కాదని, ఎప్పటికి కాదు కూడా అని ఓవైసీ ట్వీట్ లో తెలిపారు.

మన పౌరసత్వ చట్టాలలో మతం గురించి ఒక్క ప్రస్తావన కూడా లేదన్నారు. రాజ్యాంగ అసెంబ్లీ చర్చలను చదవమని సంఘ్ సిద్ధాంతకర్తలను తాను కోరుతున్నానన్నారు. మన పూర్వీకులు అప్పటి వర్ణవివక్ష-దక్షిణాఫ్రికా జాతి విధానాలను తిరస్కరించారని, కానీ బీజేపీ ఇండియా దీని సభ్యత్వం పొందటానికి ఆసక్తిగా ఉందన్నారు