Omicron Variant : దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు, క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ బాధితులు

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది.

Omicron Variant : దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు, క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ బాధితులు

corona virus

Updated On : December 24, 2021 / 11:02 AM IST

Omicron Variant : దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24గంటల్లో దేశంలో 6,650 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో 374 మంది కోవిడ్ భారీనపడి మృతి చెందారు. ఇక తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,72,626కు చేరింది. ఇక ఈ మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 3,42,15,977గా ఉంది.

చదవండి : Omicron Wave : దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తగ్గుముఖం ?

ఇక మరణాల సంఖ్య 4,79,133 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 77,516 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,40,31,63,063 మందికి టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు 359 ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్ఫష్టం చేసింది.

చదవండి : Omicron Death : జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడగా.. మహారాష్ట్రలో 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38 తమిళనాడులో 34, కర్ణాటకలో 31, గుజరాత్ లో 30, కేరళలో 27,రాజస్థాన్ 22,హర్యానా 4, ఒడిశా 4, జమ్మూకాశ్మీర్ 3, పశ్చిమ బెంగాల్ 3, ఉత్తరప్రదేశ్ 2, ఏపీలో 2, లద్దాఖ్ 1, చండిఘడ్ 1, ఉత్తరాఖండ్ 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఈ వేరియంట్ బారినపడిన వారిలో 114 మంది కోలుకోగా మిగతావారు చికిత్స పొందుతున్నారు.

చదవండి :