India Corona : దేశంలో కొత్తగా 2,85,914 కరోనా కేసులు, 665 మంది మృతి

దేశంలో 5.55 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 16.16 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు 4,00,85,116 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 4,91,127 మంది మరణించారు.

India Corona : దేశంలో కొత్తగా 2,85,914 కరోనా కేసులు, 665 మంది మృతి

Corona (1)

Updated On : January 26, 2022 / 9:56 AM IST

india new corona cases : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. దేశంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా కేసులు నాలుగు కోట్లపైగా దాటాయి. దేశంలో కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో వైరస్ తో 665 మంది చనిపోయారు. నిన్న నమోదైన కేసులతో పోల్చితే 30,040 మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 22,23,018 యక్టీవ్ కేసులు ఉన్నాయి.

Republic Day : రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

దేశంలో యాక్టివ్ కేసులు 5.55 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 16.16 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,00,85,116 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 4,91,127 మంది మరణించారు.

దేశంలో కరోన రికవరీ రేటు 93.23 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 3,73,70,971 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.