India Covid-19 : దేశంలో కొత్తగా 10,542 కరోనా కేసులు, 38 మంది మృతి
రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతు ఆందోళన కలిగిస్తోంది. దీంట్లో భాగంగానే దేశంలో కొత్తగా 10.542 కేసులు నమోదు అయ్యాయి. 38మంది కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు.

India Covid-19
India Covid-19 : భారత్ లో మరోసారి కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంట్లో భాగంగానే దేశంలో కొత్తగా 10.542 కేసులు నమోదు అయ్యాయి. 38మంది కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ కనుమరుగు అయ్యిందనుకుంటో మరోసారి దాని ప్రతాపాన్ని చూపుతోంది. ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో నేను అంతరించిపోలేదు ఉన్నాను అన్నట్లుగా ఎంటీ ఇచ్చి కేసుల్ని పెంచుకుంటుపోతోంది కోవిడ్ మహమ్మారి.మొదట్లో 1000 లోపు నమోదైన కేసులు..గణనీయంగా పెరుగుతూ భయపెడుతున్నాయి.
ఇటీవల 10 వేలు దాటుతూ వస్తున్న కరోనా కేసులు ఒక్కరోజు మాత్రం కాస్త విరామం ఇచ్చి తగ్గుముఖంపట్టాయి. దీంతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి దాని ఉదృతాన్ని పెంచింది కానీ తాజాగా 24 గంటల్లోనే 10,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీనితో ఇప్పటివరకు యాక్టీవ్ కేసుల సంఖ్య 63,562కు చేరింది. అంటే దాదాపు లక్షకు కేసులు చేరుకుంటున్నాయంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. కోవిడ్ మహమ్మారిని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేస్తే ఇది మరింతగా విస్తరించి పాతకథను రిపీట్ చేస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,48,34,859)గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.14 శాతం ఉన్నాయి. అలాగే రికవరీ రేటు 98.68 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తన తాజా కరోనా బులిటెన్‌లో వెల్లడించింది.