విమానాలకు వరుస బాంబు బెదిరింపులపై కేంద్రం అలర్ట్.. FBI, ఇంటర్‌పోల్ సాయం కోరిన భారత్..

నెల రోజుల్లో సుమారు 400కు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

విమానాలకు వరుస బాంబు బెదిరింపులపై కేంద్రం అలర్ట్.. FBI, ఇంటర్‌పోల్ సాయం కోరిన భారత్..

Bombthreats To Indian Airlines (Photo Credit : Google)

Updated On : October 31, 2024 / 10:58 PM IST

Airline Bomb Hoax Callers : దేశంలో విమానాలకు వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. వీటి నియంత్రణకు భారత్ మరో నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు బెదిరింపులు ఆగకపోవడంతో దర్యాఫ్తులో ఇంటర్ పోల్, ఎఫ్ బీఐ సాయం కోరింది భారత్. అక్టోబర్ 13 నుంచి 28వ తేదీలోపు 410 కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటి వెనుక అమెరికాలోని ఖలిస్తానీ గ్రూపుల హస్తం ఉందన్న అనుమానాలు భారత్ దర్యాఫ్తు బృందాల్లో ఉన్నాయి.

అటు భారత్ విజ్ఞప్తికి అమెరికా ఎఫ్ బీఐ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ బాంబు బెదిరింపులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆ ఈ మెయిల్స్ ను ట్రాక్ చేసేందుకు ఎఫ్ బీఐ సహకరించనుంది. అమెరికా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు భారత సిబ్బందితో టచ్ లో ఉన్నారు. ఈ బాంబు బెదిరింపుల వల్ల అమెరికా ప్రజలపైనా ప్రభావం చూపింది. దీంతో పన్ను బెదిరింపులపై దర్యాఫ్తు విషయంలో ఎఫ్ బీఐదే కీలక పాత్రగా మారనుంది.

మరోవైపు జర్మనీ, యూకే నుంచి సమాచార సేకరణకు సాయం చేయాలని భారత బృందం ఇప్పటికే ఇంటర్ పోల్ కి విజ్ఞప్తి చేసింది. వీపీఎన్ లను వాడి పంపిన సందేశాల మూలాలు ఏ దేశాల్లో ఉన్నాయనే కోణంలో దర్యాఫ్తు చేయాల్సి ఉంటుంది. బుధవారం కూడా చాలా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 6 ప్లేన్లకు ఇలాంటివి అందాయి.

మరోవైపు కేరళలోని కోజికోడ్ లో అబుదాబి వెళ్తున్న ఎయిర్ అరేబియా విమానానికి బెదిరింపు కాల్ చేసిన మహ్మద్ ఇజాజ్ అనే వ్యక్తిని పాలక్కాడ్ లో అరెస్ట్ చేశారు. నెల రోజుల్లో సుమారు 400కు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. వీటి నియంత్రణకు చర్యలు చేపట్టింది.

కాగా బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ తో ఎయిర్ లైన్స్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఒక్కో నకిలీ కాల్ వల్ల 3 కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నట్లు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్ పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్ ఇతర అవసరాలకు మరో 2 కోట్ల రూపాయలు కావాల్సి వస్తోంది. ఇక విమానాలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అటు సిబ్బందిపై పని భారం పెరిగిపోతోంది.

ఈ పరిస్థితుల్లో ఫేక్ కాల్స్ తో విమానాలకు అంతరాయాలు కలగకుండా కేంద్రం రూల్స్ మారుస్తోంది. ప్యాసింజర్, కార్గో సహా సెకండరీ లాడార్ పాయింట్ల వద్ద హ్యాండ్ బ్యాగుల చెకింగ్ ముమ్మరం చేయనుంది. మేసేజ్ లు పెడుతున్న వారిని పట్టుకునేందుకు వీపీఎన్ ప్రొవైడర్లతో కలిసి పని చేయనుంది.

Also Read : ఏడాదిగా యుద్ధం.. ఆ సమస్యతో ఇజ్రాయెల్ అష్టకష్టాలు..!