అభినందన్ కు ‘వీర్ చక్ర’ అవార్డు!

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2019 / 03:22 PM IST
అభినందన్ కు ‘వీర్ చక్ర’ అవార్డు!

Updated On : April 20, 2019 / 3:22 PM IST

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్‌ వర్ధమాన్ అభినందన్‌ పేరును భారత వాయుసేన వార్ టైమ్ గాలంట్రీ మెడల్ ‘వీర్‌ చక్ర’కు ప్రతిపాదించింది. అభినందన్ పేరుతో పాటు పాకిస్థాన్‌ లోని టార్గెట్ ల మీద బాంబులు విడిచిన 12మంది మిరాజ్‌ 2000 పైలట్ల పేర్లను వాయుసేన మెడల్ ఫర్ గ్యాలంట్రీకి ప్రతిపాదించినట్లు సమాచారం. పరమ వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర తరవాత యుద్ధ సమయాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే మూడో అత్యున్నత పురస్కారమే వీర్ చక్ర.

అభినందన్ కు సెక్యూరిటీ దృష్ట్యా శ్రీనగర్ లోని ఎయిర్ బేస్ లో కాకుండా పాకిస్థాన్ సరిహద్దుతో కలిసే వెస్ట్రన్ సెక్టార్ లోని ముఖ్యమైన ఎయిర్ బేస్ లో  పోస్టింగ్ ఇచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ తెలిపింది.పోస్టింగ్ ఆర్డర్ ఇప్పటికే జారీ అయిందని,త్వరలోనే శ్రీనగర్ ఎయిర్ బేస్ వదిలి తనకు పోస్టింగ్ ఇచ్చిన కొత్త ప్లేస్ కు అభినందన్ వెళతాడని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.