Afghan Woman : భారత సోదర,సోదరీమణులు తమని కాపాడారన్న అప్ఘాన్ మహిళ..కన్నీళ్లు పెట్టుకున్న అప్ఘాన్ ఎంపీ

భారతీయ సోదరులు,సోదరీమణులు తమను కాపాడారని అప్ఘానిస్తాన్ మహిళా శరణార్థి తెలిపింది.

Afghan Woman : భారత సోదర,సోదరీమణులు తమని కాపాడారన్న అప్ఘాన్ మహిళ..కన్నీళ్లు పెట్టుకున్న అప్ఘాన్ ఎంపీ

Afghan (4)

Updated On : August 22, 2021 / 6:36 PM IST

Afghan Woman  భారతీయ సోదరులు,సోదరీమణులు తమను కాపాడారని అప్ఘానిస్తాన్ మహిళా శరణార్థి తెలిపింది. ఇవాళ ఉదయం కాబూల్‌ నుంచి 168 మందితో బయల్దేరిన భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానం..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ విమానంలో భారత్ కు చేరుకున్న 168మందిలో..107మంది భారతీయులు,24 అఫ్ఘానిస్తాన్ సిక్కులు,ఇద్దరు అప్ఘానిస్తాన్ సెనెటర్లు,కొందరు భారతీయ సిక్కులు కూడా ఉన్నారు. 168మందిలో కొందకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కాబుల్​ నుంచి హిండన్ చేరుకున్న వారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు

భారత్ కు చేరుకున్న 168 మందిలో ఒకరైన అప్ఘానిస్తాన్ మహిళా హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ… అప్ఘానిస్తాన్ తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. అందుకే నా కూతురు,ఇద్దరు మనువరాళ్లతో భారత్ కి వచ్చాను. మా భారత సోదరులు మరియు సోదరీమణులు మమ్మల్ని కాపాడేందుకు అప్ఘాన్ వచ్చి..సురక్షితంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. తాలిబన్ అప్ఘానిస్తాన్ లోని మా ఇంటిని తగులబెట్టారు. సాయం చేసినందుకు భారత్ కు ధన్యవాదాలు అని తెలిపారు.

భారత్​కు చేరిన విమానంలో అఫ్గాన్​కు చెందిన ఎంపీ నరేందర్​ సింగ్​ ఖాస్లా కూడా ఉన్నారు. 20 ఏళ్లుగా తాము నిర్మించుకున్నదంతా నాశనమైపోయిందని..ఇప్పుడు మిగిలింది శూన్యం.. ఇంకేం లేదు అంటూ ఆవేదన చెందారు. విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే.. ఆయన పలుమార్లు కన్నీరు కార్చారు. తనను, తన కుటుంబాన్ని రక్షించినందుకు భారత్ ​కు కృతజ్ఞతలు చెప్పారు. అఫ్గాన్​ వీడటం బాధగా ఉన్నా.. ఇండియా తమకు రెండో మాతృదేశం లాంటిదని తెలిపారు. తాలిబన్లు అక్కడ.. ఎంపీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఖస్లా చెప్పారు. ఇళ్లలో తనిఖీలు చేయడం సహా.. ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. తాలిబన్లు ఆక్రమించుకున్న అప్ఘానిస్తాన్​లోఇంకా 200 మందికిపైగా హిందూ సిక్కులు చిక్కుకున్నారని పేర్కొన్నారు.