పాకిస్తాన్ నుంచి వచ్చిన ముగ్గురికి భారత పౌరసత్వం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్‌ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. 

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 08:09 AM IST
పాకిస్తాన్ నుంచి వచ్చిన ముగ్గురికి భారత పౌరసత్వం

Updated On : December 22, 2019 / 8:09 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్‌ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బీజేపీ ఎంపీ మోహన్‌ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. 2007లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన హర్సింగ్‌ సోధా, సరూప్‌ సిన్హ్‌ సోధా, పర్బత్‌ సిన్హ్‌ సోధాలకు మోర్బీలోని వావ్డీ గ్రామంలో శనివారం (డిసెంబర్ 21, 2019) జరిగిన ఒక కార్యక్రమంలో వీటిని అందజేశారు.

ఈ సందర్భంగా కుండారియా మాట్లాడుతూ పాకిస్థాన్‌ నుంచి వేల మంది శరణార్థులు గుజరాత్‌కు వచ్చి మోర్బీలో నివస్తున్నారని, తాజా చట్టం వల్ల వారంతా పౌరసత్వం పొందుతారని చెప్పారు. లబ్ధిదారుల్లో ఒకరైన హర్సింగ్‌ సోధా మాట్లాడుతూ తాము 2007లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చామని, ఈ రోజు తాము భారత పౌరులమని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఐదు రోజుల నుంచి జరుగుతూనే ఉన్న ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రెండ్రోజులుగా తీవ్రరూపం దాల్చుతుండటంతో వారణాసిలోని 8సంవత్సరాల చిన్నారితో కలిపి 48గంటల్లో 12కు చేరింది. హాస్పిటల్ వర్గాలు వెల్లడించినప్పటికీ అడిషనల్ డీజీపీ రామశాస్త్రి కేవలం ఆరుగురు మాత్రమే చనిపోయారని అసలు కాల్పులే జరపలేదని చెప్పుకొస్తున్నారు. 

పోలీసులు 3వేల 305మందిని అదుపులోకి తీసుకున్నారు. 200 మందిని అరెస్టు చేశారు. ఔరంగబాద్, మహారాష్ట్రలలో 72గంటలపాటు 144సెక్షన్ అమలులో ఉంది. 21 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. శుక్రవారం ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. బులంద్‌షెహ‌ర్ లో ఆందోళనకారులపై పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు.