Manmohan Singh : హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎయిమ్స్ వైద్యులు

తీవ్ర జ్వరంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరిస్థితి నిలకడగా వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గిందని, కొంచం నీరసంగా ఉందన్నారు వైద్యులు.

Manmohan Singh : హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎయిమ్స్ వైద్యులు

Manmohan Singh

Updated On : October 15, 2021 / 2:41 PM IST

Manmohan Singh : తీవ్ర జ్వరంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరిస్థితి నిలకడగా వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గిందని, కొంచం నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 89 ఏళ్ల మాజీ ప్రధాని ఆసుపత్రిలోని కార్డియో-న్యూరో సెంటర్‌లో చేరారు.. ప్రస్తుతం డాక్టర్ నితీష్ నాయక్ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం సంరక్షణలో ఉన్నారు.

చదవండి : నిలకడగా మాజీ ప్రధాని ఆరోగ్యం..త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష

మన్మోహన్ సింగ్ పరిస్థితి నిలకడగా ఉందని అని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు.. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా గురువారం సాయంత్రం సింగ్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

చదవండి :  మన్మోహన్ సింగ్ కు అస్వస్థత..ఎయిమ్స్ కి తరలింపు