నడి సముద్రంలో నౌకలో భారీ అగ్నిప్రమాదం.. 14మంది భారత సంతతికి చెందిన సిబ్బంది.. రంగంలోకి భారత నౌకాదళం

భారత్ నుంచి ఒమన్‌కు వెళ్తున్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

నడి సముద్రంలో నౌకలో భారీ అగ్నిప్రమాదం.. 14మంది భారత సంతతికి చెందిన సిబ్బంది.. రంగంలోకి భారత నౌకాదళం

Oman ship

Updated On : June 30, 2025 / 2:35 PM IST

Indian Navy: భారత్ నుంచి ఒమన్‌కు వెళ్తున్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంజిన్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సిబ్బంది అత్యవసర సాయం కోసం సందేశాన్ని పంపారు. వెంటనే భారత నౌకాదళ సిబ్బంది రంగంలోకి దిగారు.


గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఎం.టి యీ చెంగ్ 6 అనే నౌక ఒమన్‌కు బయలుదేరింది. ఈ నౌకలో 14మంది భారత సంతతికి చెందిన సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు. సముద్రంలో మార్గమధ్యలో ఈ నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నౌకలోని సిబ్బంది అత్యవసర సాయం కోసం సందేశం పంపారు. సమీపంలో విధుల్లో ఉన్న ‘ఐఎన్ఎస్ తంబర్’ అప్రమత్తమైంది. బోట్లు, హెలికాప్టర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది, పరికరాలను తరలించింది.

‘బోట్లు, హెలికాప్టర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది, పరికరాలను తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయని భారత నౌకాదళం ట్వీట్ చేసింది.’