అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి హోస్టన్ వెళ్లిన మోదీకి సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్ జార్జి బుష్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు.
హ్యూస్టన్‌లో చమురు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నరకు హోటల్ పోస్ట్ ఓక్‌లో 16 చమురు కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చమురు, సహజవాయువులకు భారత్ ప్రధానమైన మార్కెట్ అని వివరించిన మోదీ… భారత్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. ఉదయం 6 గంటల 5 నిముషాలకు మోదీ ఎన్నారైలతో కొద్దిసేపు గడుపుతారు.
మొత్తం వారం రోజుల పర్యటనలో.. సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం సాయంత్రం 50వేలమంది ప్రవాస భారతీయులతో ప్రధాని.. హౌడీ-మోదీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హౌడీ-మోడీ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మోది, ట్రంప్ ప్రసంగిస్తారు. రాత్రి 11 గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. అదే సమయంలో కొందరు కొందరు డెమొక్రటిక్ నేతలను మోదీ కలుస్తారు.
24వ తేదీన ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు మోదీ హాజరవుతారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని… 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అప్పుడే పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మోదీ భేటీ అవుతారు. ఆ తర్వాత 27న తిరిగి భారత్ వస్తారు.
Read More : భయపడొద్దు.. మీ బిడ్డకు హాని చేయను…కేంద్ర మంత్రి హామీ