నోరు అదుపులో: ఎన్నికల ప్రచారంలో ఈ పదాలు వాడొద్దు

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారాలలో రాజకీయ నాయుకులు వారి ఆపోజిట్ నాయకులను ‘మెంటల్’ అనే పదం ఉపయోగించి తిట్టవద్దని ఇండియన్ సైకియాట్రీ సొసైటీ కోరుతుంది. ఈ మేరకు సొసైటీకి చెందిన లీగల్ కమిటీ ఎన్నికల కమీషన్‌కు లెటర్ రాసింది. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో మతిస్థిమితం లేక బాధపడే వ్యక్తులను చూలకన చేస్తూ మాట్లాడుతున్నారని ఎన్నికల ప్రచారంలో “మెంటల్ వచ్చినట్లుందే, పిచ్చి, పిచ్చి పట్టింది హాస్పిటల్‌కు పంపండి, పిచ్చి పట్టిందా?” పదాలను నిషేంధించాలంటూ ఎన్నికల సంఘంను కోరింది.
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?
అలాగే మానసిక వికలాంగుల ఆసుపత్రుల పేర్లను వాడుతూ ప్రచారం చేయనివ్వకండి అంటూ సొసైటీ కోరింది. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు ఇటువంటి మాటలను మాట్లాడడం కరెక్ట్ కాదని సొసైటీ అందులో రాజకీయ నాయకులకు సూచించింది. ఇటువంటి కామెంట్లు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం అవుతున్నియని అటువంటివాటికి అడ్డు కట్ట వేయాలంటూ సొసైటీ ఎన్నికల సంఘంను కోరింది.
మానసిక వికలాంగులను కించపరచకుండా వ్యాఖ్యలు చేయాలని ఇది సామాజిక బాధ్యతగా నాయకులు భావించాలని ఇండియన్ సైకియాట్రీ సొసైటీ రాజకీయ నాయకులకు సూచించింది.
Read Also : స్వరం మారింది : పవన్ కింగ్ మేకర్ అవుతారా