కొత్తరైళ్లు: పట్టాలెక్కేందుకు లగ్జరీ రైళ్లు సిద్ధం

ఈ ఏడాదిలో మరికొన్ని కొత్త ట్రైన్‌లను వాడుకలోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. హుమ్‌సాఫర్ ఎక్స్‌ప్రెస్‌లను, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ల మాదిరి రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారత రైల్వే భావిస్తుంది. ఈ రెండు రైళ్లను భారత రైల్వే 2016, 2017 సంవత్సరాలలో ప్రవేశపెట్టాయి. హుమ్‌సాఫర్ ఎక్స్‌ప్రెస్‌లలలో అన్నీ ఏసీ3-టైర్ కోచెస్ మాత్రమే ఉంటాయి. నైట్ మొత్తం జర్నీ చేసేవారికి వీలుగా ఈ ట్రైన్లు ఉంటాయి. అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ లేని వారికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ రైల్వే 20హుమ్‌సాఫర్ ఎక్స్‌ప్రెస్‌లను, 10అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లను కొత్తగా ప్రవేశపెట్టబోతుంది. దీంతో మొత్తం 30లగ్జరీ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది.
రైల్వే అధికారులు చెప్పిన ప్రకారం ఈ రెండు ట్రైన్లకు ప్రజల నుంచి ఆదరణ పెరిగిన నేపధ్యంలో అదే రకమైన కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు. కొత్తగా తయరైన రైళ్లలో మల్టిపుల్ చార్జింగ్ పాయాంట్స్, విశాలమైన సీట్లతో పాటు.. ప్రమాదం జరిగితే వెంటనే తప్పించుకునేందుకు వాలుగా ఫైర్‌ను కంట్రోల్ చేసే గ్యాస్ సిస్టమ్‌లు, భద్రత కోసం సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే చెబుతుంది. 2019లో వీటిలో సగం రైళ్లను పట్టాలెక్కించి, మిగిలినవాటిని 2020లో పట్టాలెక్కించనున్నట్లు ఇండియన్ రైల్వేస్ చెబుతుంది. అలాగే అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ.. ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా తయారు చేస్తున్నట్లు రైల్వే చెబుతుంది. ఉదయం ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌సీడీ స్క్రీన్‌లను కూడా పెట్టే ఆలోచనలో రైల్వేస్ ఉంది.