Vande Bharat Sleeper Coach : వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త…వచ్చే ఏడాది స్లీపర్ కోచ్‌లు

దేశంలోని వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వచ్చే ఏడాది వందే భారత్ స్లీపర్ కోచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2024వ సంవత్సరంలో హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వే ప్రయాణీకులను రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుమతించనున్నాయి....

Vande Bharat Sleeper Coach : వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త…వచ్చే ఏడాది స్లీపర్ కోచ్‌లు

Vande Bharat Sleeper Coach

Updated On : October 1, 2023 / 9:49 AM IST

Vande Bharat Sleeper Coach : దేశంలోని వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వచ్చే ఏడాది వందే భారత్ స్లీపర్ కోచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2024వ సంవత్సరంలో హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వే ప్రయాణీకులను రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుమతించనున్నాయి. (Vande Bharat Sleeper Coach) ఇప్పటివరకు ఛైర్ కార్ ప్రయాణాలకే పరిమితమైన వందేభారత్ రైళ్లు ఇక స్లీపర్ రైళ్లుగా మారనున్నాయి.

LPG cylinder : ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర పెంపు

భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైలును కొత్త డిజైన్‌తో తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి. (Roll Out Vande Bharat Sleeper Coach) వందే భారత్ స్లీపర్ కోచ్‌ల కొత్త డిజైన్‌ను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లు తయారు చేయనున్నాయి. కొత్తగా రూపొందించిన స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలు 2024 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు. (Indian Railways)

Maldives : మాల్దీవుల అధ్యక్షుడిగా మొహహ్మద్ మయిజ్జు విజయం

స్వదేశీ సెమీ లైట్ స్పీడ్ రైలు ప్రయాణీకులకు పూర్తిగా కొత్త ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి. వేగం, భద్రత, మెరుగైన సేవలు ఈ వందేభారత్ స్లీపర్ రైలు ముఖ్యాంశాలు. ప్రపంచ స్థాయి ఫీచర్లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. న్యూఢిల్లీ- వరణాసి మధ్య మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను2019వ సంవత్సరం ఫిబ్రవరి 15వతేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

Carpooling : కార్‌పూలింగ్‌పై నిషేధం…బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ రైలు సెట్ మేక్-ఇన్-ఇండియా చొరవకు చిహ్నంగా నిలుస్తూ భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. దేశంలోని మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. ఈ రైలు కోట-సవాయి మాధోపూర్ సెక్షన్‌లో గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది.