Sameer Wankhede : ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన సమీర్ వాంఖడేకు బెదిరింపు

ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి సమీర్ వాంఖడేకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో విధులు నిర్వహిస్తున్న సమీర్ వాంఖడేకు ఫోన్‌లో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు....

Sameer Wankhede : ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన సమీర్ వాంఖడేకు బెదిరింపు

Sameer Wankhede

Sameer Wankhede : ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి సమీర్ వాంఖడేకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో విధులు నిర్వహిస్తున్న సమీర్ వాంఖడేకు ఫోన్‌లో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు ఫోన్ కాల్ పై సమీర్ ముంబయి పోలీసు కమీషనర్‌కి, గోరేగావ్ పోలీస్ స్టేషన్‌కి కూడా ఒక ఈమెయిల్ పంపారు. ముంబయిలో తన శాశ్వత నివాసం ఉన్నందున బెదిరింపు ఫోన్ కాల్ గురించి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశామని సమీర్ చెప్పారు.

Also Read :US War Ship USS Gerald R Ford : ఇజ్రాయెల్‌కు వచ్చిన అమెరికా యుద్ధ నౌక వెరీ డేంజర్ గురూ

ఈ ఫిర్యాదుపై తాము గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబయి పోలీసు అధికారి తెలిపారు. వాంఖడే రెండేళ్ల క్రితం ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పనిచేశారు. అప్పట్లో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు సంబంధించిన మాదకద్రవ్యాల స్వాధీనం కేసుతో సహా కొన్ని ఉన్నత స్థాయి కేసులను దర్యాప్తు చేశారు.

Also Read :Israeli woman : ఇజ్రాయెల్ వీర వనిత 25 మంది ఉగ్రవాదులను హతమార్చింది…

క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ కు సంబంధం లేదని దర్యాప్తులో తేలడంతో సమీర్ వాంఖడేపై కేంద్ర ప్రభుత్వం బదిలీవేటు వేసింది. పలు కీలక వివాదాల్లో చిక్కుకున్న సమీర్ వాంఖడేకు తాజాగా బెదిరింపు రావడంపై ముంబయి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.