ఫిబ్రవరి నాటికి దేశంలో 50%మందికి కరోనా వస్తుంది: కేంద్ర కమిటీ

covid:దేశంలో సగం జనాభాకు వచ్చే ఫిబ్రవరి నాటికి Covid Positive వస్తుందట. వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ కమిటీ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇండియాలో ఇప్పటివరకూ 7.55 మిలియన్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఇండియానే రెండో స్థానంలో ఉంది.
సెప్టెంబర్ నెల మధ్యలో తారాస్థాయికి చేరిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సగటున 61వేల 390 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి.
https://10tv.in/covid-peak-over-can-be-controlled-early-next-year-says-panel/
‘మా గణాంకాల ప్రకారం.. 30శాతం జనాభా ప్రస్తుతం కరోనా బారిన పడ్డారు. ఇవి క్రమంగా 50శాతానికి చేరవచ్చు’ అని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ వెల్లడించారు.
నిజానికి వైరస్ వ్యాప్తి కేంద్ర ప్రభుత్వ సెరాలాజికల్ సర్వేల్లో ఉన్న దాని కంటే వేగంగా ఉందని కమిటీ అంచనా. ఈ కారణంగా సెప్టెంబర్ వరకూ నమోదైన కేసులతో పోలిస్తే కేవలం 14శాతం మాత్రమే వైరస్ వ్యాప్తికి గురవుతారు. సెరాలాజికల్ సర్వేలు దాదాపు వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే జనాభాలో మార్పులు దీనిపై ప్రభావం చూపిస్తాయి.