దేశవ్యాప్తంగా ఈ ప్రాంతాల నుంచే కరోనా వ్యాప్తి చెందుతుందా? ఈ డేంజరస్ వైరస్‌ని కట్టడి చేయడం ఎలా?

Corona Virus
భారత్ లో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ‘పరిమిత స్థానిక వ్యాప్తి’ దశకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత్‌లో ఎలాంటి కరోనా కమ్యూనిటీ వ్యాప్తి లేదని జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ కూడా చెప్పారు. ఒక్క సోమవారం (మార్చి 30, 2020)లో 150 కొత్త కేసులు
నమోదైనట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకూ స్వల్ప సంఖ్యలో ఉన్న కరోనా కేసులు.. ఒకేసారి పెద్ద సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదు కావడానికి ప్రత్యేకించి కొన్ని
సమూహంతో సంబంధం ఉందని పరిగణించవచ్చు.
ఢిల్లీ నిజాముద్దీన్ వెస్ట్ :
దేశంలో వివిధ ప్రాంతాల్లో నమోదైన కరోనా పాజిటీవ్ కేసులన్నింటికి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ ప్రాంతంతో సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇక్కడకు
వచ్చిన ప్రార్థనాలు చేసినవారిలో చాలామందికి కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటివరకూ 9 మంది మృతిచెందారు. వారిలో తెలంగాణ
నుంచి ఆరుగురు మృతిచెందగా, శ్రీనగర్, తమిళనాడు, కర్ణాటక ఒక్కొక్కరు మృతిచెందారు. అండమాన్, నికోబార్ దీవుల్లో 9 పాజటీవ్ కేసులు, ఢిల్లీలో 18 పాజిటివ్ కేసులు
నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మార్చి రెండో వారంలో కరోనా సోకిన వారంతా తాబ్లిగ్-ఈ-జామత్ అనే ముస్లిం సంస్థ నిర్వహించిన ప్రార్థన సమావేశాలకు
హాజరయ్యారు.
ఈ సమావేశానికి దాదాపు 250 విదేశీయులు హాజరు కాగా, ఆ తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు ప్రయాణించినట్టు గుర్తించారు. దాదాపు 300 మందిలో కరోనా లక్షణలు
(జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం) బయటపడటంతో దేశవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. జమాత్ కేంద్రకార్యలయాన్ని బంగ్లే వాలీ మసీద్ అని కూడా పిలుస్తారు.
ఇప్పుడు ఈ మసీదుకు సీల్ వేశారు. దీనికి సమీపంలోని 500 నివాసితులను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో నిజాముద్దీన్ సమావేశానికి తమ రాష్ట్రం నుంచి హాజరైన 980
మందిని గుర్తించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సోమవారం వరకు రాష్ట్రంలో 38 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ మంది ఢిల్లీ ఈవెంట్ తో సంబంధం
ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.
రాజస్థాన్, బిల్వారా : ఇప్పటివరకూ 25 వరకు కరనోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతిచెందారు. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో 6 వైద్యులు, వైద్య సిబ్బందికి పాజిటివ్
రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి వైరస్ ఎలా సోకింది అనేదానిపై అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు వెల్లడించలేదు. సోమవారం నాటికి 6వేల
మందిని క్వారంటైన్ చేయగా, బిల్వారా జిల్లాలో దాదాపు 28 లక్షల మందిపై సర్వే నిర్వహించారు.
కేరళలో సోమవారం వరకు 32కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా 234కు వరకు చేరుకున్నాయి. అందులో విదేశాల నుంచి వచ్చినవారు 17 మంది
ఉన్నారు. మిగతావారిలో స్థానికంగా వైరస్ సోకినవారు ఉన్నారు. కేసర్ గాడ్ జిల్లాలో మాత్రం 15కు పైగా కేసులు రికార్డు అయ్యాయి. ఒక్క జిల్లాలోనే మొత్తం 30 పాజిటివ్
కేసులు వరకు నమోదయ్యాయి.
బరేలీ, ఉత్తరప్రదేశ్ : యూపీ రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కార్మికులపై జిల్లా అధికారులు క్లోరిన్ నీళ్లతో స్ప్రే చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వలస కూలీలపై
వివక్షత చూపడం అందరిని షాకింగ్ గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వలస కూలీలందరిని ఒకేచోట కూర్చొబెట్టి
వారిపై అధికారులు కెమికల్ స్ప్రే చేశారు. వలస కూలీల్లో మహిళలతోపాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)
దాఖలైంది. ఈ పిల్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులపై జరిగిన ఘటనకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కేంద్రం
స్పందించాల్సిందిగా సూచించింది. దీనిపై మంగళవారం విచారణ కొనసాగనుంది.