భారత్ తొలి మహిళా క్రికెట్‌ వ్యాఖ్యాత చంద్ర నాయుడు కన్నుమూత

భారత్ తొలి మహిళా క్రికెట్‌ వ్యాఖ్యాత చంద్ర నాయుడు కన్నుమూత

Indias First Female Commentator Chandranaidu Passes Away

Updated On : April 5, 2021 / 11:54 PM IST

Indias First Female Commentator ChandraNaidu Passes Away : భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు తన 88 కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రనాయుడు ఆదివారం (ఏప్రిల్ 4,2021)న ఈ లోకాన్ని విడిచారు. ఇండోర్‌లోని తన నివాసంలో ఆమె తన తుది శ్వాసను విడిచారు. క్రికెట్‌ దిగ్గజం డా. సీకే నాయుడు కుమార్తె చంద్ర నాయుడు.

ఈమె క్రికెట్‌ వ్యాఖ్యానం‍తో పాటు ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. 50 వ దశకంలో జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడిన ఘతన చంద్ర నాయుడు సొంతం. ఆనాడే క్రికెట్ రంగంలో తనదైన ముద్ర వేశారు చంద్రనాయుడు. మహిళలు ఇంట్లోంచి బైటకొచ్చి క్రీడారంగంలో ప్రతిభ కనబరచటం చాలా అరుదు అయిన ఆరోజుల్లోనే చంద్రనాయుడు ఈ ఘతన సాధించటం విశేషం.

ఆరోజుల్లో మహిళల క్రికెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేదు. దీంతో ఆమె పలు విధాలుగా క్రికెట్ లో తనదైన శైలిలో కామెంటరేటర్ గా ముద్రవేసుకున్నారు. భారతదేశపు తొలి మహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు చంద్రనాయుడు. క్రికెట్‌ పట్ల ఆమెకున్న ఆసక్తి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ క్రమంలో బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. చంద్ర నాయుడు మృతి పట్ల మాజీ క్రికెటర్‌, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంపీసీఏ) అధ్యక్షుడు సంజయ్‌ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.