గతేడాది భారత్ అత్యధిక దిగుమతులు చైనా నుంచే
తేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా..చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించినా ఆ దేశం నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.

Indias Imports From China At 58 71 Billion Post Galwan Says Government12
Hardeep Singh Puri గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా..చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించినా ఆ దేశం నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో చైనా నుంచి భారత్ 58.71 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. భారత్‌కు అత్యంత మిత్రదేశంగా పరిగణిస్తున్న అమెరికా రెండో స్థానంలో ఉండటం ఆసక్తికర పరిణామం.
బుధవారం లోక్‌సభలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు…2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో చైనా నుంచి భారత్ చైనా నుంచి 58.71 బిలియన్ల డాలర్లు, అమెరికా నుంచి 26.89 బిలియన్ల డాలర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 23.96 బిలియన్ల డాలర్లు, సౌదీ నుంచి 17.73 బిలియన్ల డాలర్లు, ఇరాక్ నుంచి 16.26 బిలియన్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర పరిశ్రమలు,వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరీ లిఖితపూర్వకంగా సమాదానమిచ్చారు.
భారత్ గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 371.98 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంది. అందులో టాప్-5 దేశాల నుంచి 143.55 బిలియన్ల డాలర్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. అవి మొత్తం దిగుమతుల్లో 38.59 శాతం.