Union Budget 2022 : డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ.. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ!

డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది.. డిజిటల్ రూపీని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.

Union Budget 2022 : డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ.. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ!

India's Own Digital Currenc

Updated On : February 1, 2022 / 1:49 PM IST

Union Budget 2022 : డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది… డిజిటల్ రూపీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ (Digital Currency) అందుబాటులోకి రానుంది. బ్లాక్ చెయిన్  (Block Chain) టెక్నాలజీని ఉపయోగించి ఆర్బీఐ (RBI) ద్వారా డిజిటల్ రూపీని తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్  ప్రసంగంలో వెల్లడించారు. డిజిటల్‌ కరెన్సీతో డిజిటల్‌ బ్యాంకింగ్‌ అభివృద్ధి అవుతుందని అన్నారు.

బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో ఆర్బీఐ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. 2022 డిజిటల్‌ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ‘యానిమేషన్‌ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని మంత్రి నిర్మల పేర్కొన్నారు. 2021-22లో రాష్ట్రాలకు రూ.15వేల కోట్ల రుణాలను అందించినట్టు తెలిపారు.

క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు సీతారామన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో ఆర్‌బీఐ ద్వారా త్వరలో డిజిటల్‌ కరెన్సీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీ తీసుకొస్తామన్నారు. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్‌ కరెన్సీల రూపకల్పన చేయనున్నట్లు వివరించారు. డిజిటల్‌ రూపీ ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రోత్సాహం అందించినట్టు అవుతుందని మంత్రి నిర్మల సీతారామన్ ఆకాంక్షించారు.

మరోవైపు.. ఈ ఏడాది నుంచే ఈ-పాస్టుపోర్టుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సిలికాన్ చిప్ తో ఈ-పాస్ పోర్టులను జారీ చేయనున్నట్టు మంత్రి నిర్మల వెల్లడించారు. ఇకపై అన్ని పోస్టాఫీసుల్లో మొబైల్, నెట్ బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి పోస్టాఫీసులు రానున్నాయి.

Read Also : Union Budget 2022 : PM ఆవాస్ యోజన కింద.. 80 లక్షల ఇళ్లు : మంత్రి నిర్మలా