India Rice Restrictions : అమెరికా వ్యాపారులకు డాలర్లు కురిపిస్తున్న భారత్ బియ్యం .. ఆందోళన వ్యక్తం చేస్తున్న IMF

భారత్ నిషేధం విధించటంతో అమెరికాలో బియ్యం డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అమెరికాలో బియ్యం వ్యాపారులకు డాలర్ల వర్షం కురుస్తోంది. డిమాండ్ ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.

India Rice Restrictions : అమెరికా వ్యాపారులకు డాలర్లు కురిపిస్తున్న భారత్ బియ్యం .. ఆందోళన వ్యక్తం చేస్తున్న IMF

IMF..Pierre Olivier Gourinchas

Updated On : July 28, 2023 / 12:40 PM IST

India rice In Us..IMF : భారతదేశపు బియ్యానికి (India rice)ఎంత డిమాండ్ ఉందో ప్రస్తుతం అమెరికా (america), కెనడా(Canada)ఆస్ట్రేలియా ( Australia )వంటి దేశాల్లో నెలకొన్న పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. భారత్ నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేదం విధించటంతో బియ్యం కోసం విదేశాల్లో ఉండే భారతీయులు ఎగబడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. భారత్ నిషేధం విధించటంతో అమెరికాలో బియ్యం డిమాండ్ బాగా పెరిగింది.బాగాఅనేకంటే విపరీతంగా పెరిగింది. ఎక్కడ బియ్యంకొరత వస్తుందోనని ఎన్నారైలు భారీగా బియ్యాన్ని కొనేస్తున్నారు. ప్యాకెట్లు ప్యాకెట్లు కొనేసుకుని స్టోర్ చేసుకుంటున్నారు.

దీంతో అమెరికాలో బియ్యం వ్యాపారులకు డాలర్ల వర్షం కురుస్తోంది. డిమాండ్ ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. అధిక ధరలకు అమ్ముతుండటంతో డాలర్ల వర్షం కురుస్తోంది. దీంతో భారత్ బియ్యం అమెరికా వ్యాపారులకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు దండుకోవాలనే పరిస్థితులను స్టోర్స్ యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు.

భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో బియ్యం డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఒక్క అమెరికానే కాదు ఆస్ట్రేలియా, కెనడాలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. పెరిగిన డిమాండు అమెరికాలో బియ్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంపట్ల ఐఎంఎఫ్‌ (International Monetary Fund) ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో బియ్యం కోసం జనం ఎగబడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంతో పెద్ద బియ్యం కంపెనీలన్నీ ధరలను భారీగా పెంచేశాయి. అయినా బియ్యం కొనుగోళ్లు ఎక్కడా ఆగటంలేదు.

NRIs : అమెరికాలో బియ్యం కొనుగోళ్లకు ఎగబడుతున్న ఎన్నారైలు.. స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు

భారత్‌ నిషేధం విధించిన తర్వాత అమెరికాలో ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయని కొనుగోలు దారులు చెబుతున్నారు. వ్యాపారులు కూడా డిమాండ్ కు తగిన స్టాక్ లేకపోవటంతో ధరలు కూడా పెంచామని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం నిషేధాన్ని ఇతర నిత్యావసర వస్తువులకు కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న స్టోర్ యాజమాన్యాలు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల్ని కూడా కొనేస్తున్నారు. స్టోర్ యాజమాన్యాలే కాదు అక్కడ రెస్టారెంట్ల యాజమాన్యాలు కూడా ఇదే చేస్తున్నాయి.

రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ధరలు బాగా పెరిగాయి. దీనికి తోడు తాజాగా బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాంపిల్ గా కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

Ban On Rice Export : ఆస్ట్రేలియాలోను అమెరికాలాంటి ఘటనలే.. బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు

దీంట్లో భాగంగా బియ్యం ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధంతో పరిస్థితులు మరింత కష్టతరమయ్యేలా ఉన్నాయి. బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించటంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (International Monetary Fund) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ఆంక్షలను ఎత్తి వేయాలని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థిక వేత్త పియర్‌ ఒలివర్‌ గౌరించస్‌ (Pierre Olivier Gourinchas is the Economic Counsellor and the Director of Research of the IMF)కోరారు. భారత్‌ తీసుకున్న నిర్ణయం.. ప్రపంచ వ్యాప్తంగా ఆహారధరలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ పరిస్థితి మరింతగా పెరగనుందని అంతేకాకుండా ఈ పరిస్థితులు ప్రతీకార చర్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.