Viral Video: అమ్మాయితో వెళ్తూ.. 140 స్పీడుతో కారును నడిపి బైకును గుద్ది పడేసిన సోషల్ మీడియా స్టార్
అతడి పక్కన ఓ అమ్మాయి, వెనుక సీట్లో మరో ప్రయాణికుడు కూర్చుకున్నాడు.

ఓ సోషల్ మీడియా స్టార్ 140 స్పీడుతో కారును నడిపి బైకును గుద్ది పడేసి, ఆగకుండా దూసుకెళ్లాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి అతడి పక్కనే ఉంది. మెల్లిగా వెళ్లాలని అతడికి ఆమె చెబుతున్నా అతడు వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు.
ఫిట్‌నెస్ ‘ఇన్‌ఫ్లుయెన్సర్’ రజత్ దలాల్ పాల్పడ్డ ఈ చర్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రజత్ పై గతంలోనూ ఓ కేసు ఉంది. ఇటీవల అతడు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అతి వేగంగా కారు నడుపుతూ వెళ్లాడు. అతడి పక్కన ఓ అమ్మాయి, వెనుక సీట్లో మరో ప్రయాణికుడు కూర్చుకున్నాడు.
వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డు చేశాడు. రద్దీగా ఉండే హైవే గుండా నిర్లక్ష్యంగా కారును డ్రైవింగ్ చేస్తూ దలాల్ 143 కి.మీ.వేగంతో కారును నడిపాడు. ఆ సమయంలో ఓ బైకుని ఢీకొట్టినప్పుడు పెద్ద చప్పుడు వినిపించింది.
‘‘సర్, సర్.. సర్.. అతను కింద పడిపోయాడు, దయచేసి ఇంత వేగం వద్దు’’ అని పక్కనే కూర్చున్న అమ్మాయి అనడం వీడియోలో వినపడింది. అతను పడిపోయినా ఫర్వాలేదంటూ రజత్ దలాల్ ఏ మాత్రం పట్టించుకోకుండా అదే వేగంగా ముందుకు దూసుకుపోయాడు. రజత్ దలాల్‌కు ఫరీదాబాద్ పోలీసులు చలాన్ జారీ చేశారు.
“GIR GAYA KOI BAAT NAHI. YE TO HAMARA ROZ KA KAAM HAI ”
Habitual Offender #RajatDalalPsycho hits a biker while driving at a speed of 143Kmph on a busy inner city highway
PLZ IDENTIFY ROAD & TAG COPS@dtptraffic @FBDPolice @police_haryana @cmohry @noidatraffic @gurgaonpolice pic.twitter.com/RD2sEQVsnd
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 29, 2024
Also Read: ఆ రోజు కాల్పులు జరిపింది వీళ్లే: మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి