Navratri: దుర్గా మండపం పెట్టినందుకు దళితులపై దాడికి దిగిన ఆధిపత్య వర్గాలు.. కర్రలతో కొట్టుకున్న ఇరు వర్గాలు
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కంకర్ అనే గ్రామంలో దళితులు దుర్గా మాత మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అయితే దళితులు దేవతామూర్తిని ప్రతిష్టించడం ఏంటని అదే గ్రామంలోని ఆధిపత్య వర్గాలకు చెందిన కొంత మంది వారిపై దాడికి దిగారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది, ఒకరినొకరు తోసుకుంటూ చేతికి అందిన కర్రలతో కొట్టుకున్నారు.

Intense fight over Nvratri celebration for Dalit community installed idol of Goddess Durga
Navratri: అందరం హిందువులమే, ఆత్మ బంధువులమే అనే మాటలు కేవలం నీటి మూటలే. మాటల్లో ఉండే ఈ ఐక్యత చేతల్లో కనిపించడమే సాధ్యం కావడం లేదు. దేశంలో ప్రతి రోజు జరుగుతున్న ఉదహారణలు ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని నొక్కి చెప్తూనే ఉంటాయి. తాజాగా దళితులు దుర్గా మండపం పెట్టినందుకు ఆధిపత్య వర్గాలు వారిపై దాడికి దిగారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రమవడంతో ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ జిల్లాలో ఉన్న కంకర్ అనే గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కంకర్ అనే గ్రామంలో దళితులు దుర్గా మాత మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అయితే దళితులు దేవతామూర్తిని ప్రతిష్టించడం ఏంటని అదే గ్రామంలోని ఆధిపత్య వర్గాలకు చెందిన కొంత మంది వారిపై దాడికి దిగారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది, ఒకరినొకరు తోసుకుంటూ చేతికి అందిన కర్రలతో కొట్టుకున్నారు. కాగా, ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, సోషల్ మీడియాలో సర్యూలేట్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అనంతరం స్థానికులను విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Indonesia: ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం విధ్వంసానికి పాల్పడ్డ అభిమానులు.. 174 మంది మృతి