అందమైన అద్భుత నిర్మాణం తాజ్ మహల్‌కు ముప్పు పొంచి ఉందా? ఏంటా ముప్పు?

సుమారు 400 ఏళ్ల వయసున్న అపురూప కట్టడం తాజ్ మహల్. మొదట్లో తెల్లటి పాలరాతి రంగుతో వెలుగులు విరజిమ్మేది.

అందమైన అద్భుత నిర్మాణం తాజ్ మహల్‌కు ముప్పు పొంచి ఉందా? ఏంటా ముప్పు?

Updated On : September 16, 2024 / 12:46 AM IST

Is Taj Mahal In Danger : తాజ్ మహల్.. ఈ పేరు వినగానే భార్యపై అమితమైన ప్రేమతో మొఘల్ చక్రవర్తి షా జహాన్ కట్టించిన అపురూపమైన స్మారక చిహ్నం, పాలరాతి అద్భుత కట్టడం కళ్ల ముందు కదలాడుతుంది. అందమైన యమునా నది అసూయపడే అందం నీదని ఒకరు కీర్తిస్తే, వెన్నెలే అబ్బురపడే వేల శిల్పుల అపూర్వ నిర్మాణం అని మరొకరు తాజ్ మహల్ ను కొనియాడారు. తాజ్ మహల్ ఒక అందమైన అద్భుత నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇటు వరదలు అటు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని ముప్పు ముంగిట్లో ఉంది ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్..

సుమారు 400 ఏళ్ల వయసున్న అపురూప కట్టడం తాజ్ మహల్. మొదట్లో తెల్లటి పాలరాతి రంగుతో వెలుగులు విరజిమ్మేది. కానీ, క్రమంగా ఆ వెలుగులు తగ్గిపోతున్నాయి. గాలి కాలుష్యం, వాతావరణ మార్పులు, యమునా నది కాలుష్యం కారణంగా ఈ ఐకానిక్ నిర్మాణం ఇప్పుడు పసుపు వర్ణంలోకి మెల్లగా గోధుమ వర్ణంలోకి మారిపోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా తాజ్ మహల్ మనుగడను ప్రశ్నార్థంక చేస్తోందని అంటున్నారు.

 

 

Also Read : కిరణ్ కుమార్ రెడ్డికే పగ్గాలు? ఏపీపై బీజేపీ భారీ స్కెచ్‌..!