చంద్రయాన్-2 ల్యాండర్ ఆచూకీ దొరికింది

  • Published By: vamsi ,Published On : September 8, 2019 / 08:39 AM IST
చంద్రయాన్-2 ల్యాండర్ ఆచూకీ దొరికింది

Updated On : September 8, 2019 / 8:39 AM IST

చంద్రయాన్ 2లో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. కనిపించకుండాపోయిన విక్రమ్ ల్యాండర్ లోకేషన్‌ను ఇస్రో గుర్తించింది. ఆర్బిటర్ దీనిని కనిపెట్టింది. థర్మల్ ఇమేజ్ క్లిక్ చేసింది ఆర్బిటర్. కమ్యూనికేషణ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ స్థానాన్ని గుర్తించడం జరిగిందని, ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌లను ఆర్బిటర్ తీసిందన్నారు. కానీ కమ్యునికేషన్ మాత్రం కావట్లేదని, త్వరలో కమ్యునికేషన్‌ను పునరుద్దరిస్తామని అన్నారు. ల్యాండర్‌తో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో చీఫ్ కె.శివన్ ప్రకటించారు.

సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో చందమామ మీద లాండింగ్ చేస్తున్న సమయంలో విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటనలో తెలిపింది.