ITC చైర్మన్ దేవేశ్వర్ కన్నుమూత

ITCగ్రూప్ కి సుదీర్ఘకాలంపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించిన యోగేష్ చందర్ దేవేశ్వర్(72) కన్నుమూశారు.కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(మే-11,2019)తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్ కి భార్య,కొడుకు ఉన్నారు. ఐసీటీ ఎదుగుదలలో దేవేశ్వర్ ది చాలా కీలక పాత్ర పోషించారు. 1968లోఐటీసీలో చేరిన దేవేశ్వర్ 1996లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. ఫిబ్రవరి 5, 2012న మరోసారి డైరెక్టర్ గా, చైర్మన్ గా దేవేశ్వర్ ఎన్నికై 2017 వరకు కొనసాగారు. 2017 నుంచి నాన్ ఎగ్జిక్యటివ్ చైర్మన్ గా దేవేశ్వర్ కొనసాగుతున్నారు. 1991-94 మధ్య కాలంలో ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. హార్వార్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం..ప్రపంచంలో ఏడవ బెస్ట్ ఫర్ఫార్మింగ్ సీఈవోగా దేవేశ్వర్ ర్యాంక్ సాధించారు.దేవేశ్వర్ మృతి పట్ల ఐటీసీ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు.
దేవేశ్వర్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.ఇండియన్ ఇండస్ట్రీలో దేవేశ్వర్ చాలా బలమైన పాత్ర పోషించారని అన్నారు.ఐటీసీ ప్రపంచస్థాయికి ఎదగడంలో దేవేశ్వర్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు.ఆయన కుటుంబ సభ్యులకు,మిత్రులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.