మంచుపూల దారి గుల్మార్గ్ : చూస్తే మైమరచిపోవాల్సిందే

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 10:50 AM IST
మంచుపూల దారి గుల్మార్గ్ : చూస్తే మైమరచిపోవాల్సిందే

Updated On : November 6, 2019 / 10:50 AM IST

శీతాకాలం  చల్లని మంచు తో పాటు వెన్నెల కూడా కురిసేకాలం. పండు వెన్నెలకు తోడు  చల్లని మంచు కూడా కురుస్తుంటూ భూతల స్వర్గం అంటే ఇదేనంటోంది గుల్మార్గ్. గుల్మార్గ్ అంటే మంచుపూల దారి  అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతంలో మంచు పూలజల్లులా కురుస్తోంది. 
జమ్ము కశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో గుల్మార్గ్ ఒకటి. ఇటువంటి ఎన్నో ప్రాంతాలు కశ్మీర్ లో ఉన్నా గుల్మార్గ్ ప్రత్యేకతే వేరు. ఆ మంచు సోయగమే వేరు అన్నట్లుగా ఝల్లు ఝల్లుగా కురుస్తోంది హిమపాతం.

గుల్మార్గ్  ప్రాంతమంతా మంచు కురిసే దారులుగా మారిపోయాయి. కొన్నిచోట్ల దారి కనిపించనంత దట్టంగా మంచు కురుస్తోంది. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌లో డిసెంబర్ రాకతో హిమపాతం మొదలవుతుంది. కానీ ఈ సీజన్ లో మాత్రం  నవంబరులోనే మంచు పడుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. బుధవారం (నవంబర్ 6) మంచుకురుస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. చూడండీ..ఆ మంచుపూల వానలో తడిచిపోండి.మనసారా ఆస్వాదించండి..