జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. 44మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. ముస్లీం అభ్యర్థులు ఎంతమంది అంటే?
జమ్మూకశ్మీర్ లో చివరిసారి 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఐదు దశలో ఎన్నికలు నిర్వహించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దవ్వడంతో ..

Jammu Kashmir Election
BJP Candidates List For Jammu-Kashmir Election 2024 : జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో 26 స్థానాలకు, మూడో దశలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను 44 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో విడత కోసం 19 మంది అభ్యర్థుల పేర్లను కమలదళం ఖరారు చేసింది.
Also Read : BJP: మంచుకొండల్లో మంట పుట్టిస్తున్న పాలిటిక్స్
బీజేపీ తొలి జాబితాలో కీలక నియోజకవర్గాలైన అనంత్ నాగ్ వెస్ట్ నుంచి మహమ్మద్ రఫీక్ వనీ, పాంపోర్ నియోజకవర్గం నుంచి సయ్యద్ షోకాత్ గయూర్ అంద్రబీ, షోపియాన్ నుంచి జావెద్ అహ్మద్ ఖాద్రి, అనంత్ నాగ్ నుంచి సయ్యద్ వజాహత్, దోడా నుంచి గజయ్ సింగ్ రాణా తదితరులు పోటీలో ఉన్నారు. తొలి జాబితాలో 14 మంది ముస్లిం అభ్యర్థులకు బీజేపీ టికెట్లు కేటాయించింది.
Also Read : Lefthanders Day: ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?
జమ్మూకశ్మీర్ లో చివరిసారి 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఐదు దశలో ఎన్నికలు నిర్వహించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దవ్వడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తరువాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈ దఫా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
BJP releases a list of 44 candidates for the upcoming Jammu & Kashmir assembly elections
Arshid Bhat to contest from Rajpora, Javed Ahmad Qadri to contest from Shopian, Mohd. Rafiq Wani to contest from Anantnag West. Adv. Syed Wazahat to contest from Anantnag, Sushri Shagun… pic.twitter.com/s7dXVe8Fdm
— ANI (@ANI) August 26, 2024
Jammu & Kashmir assembly elections | Pawan Gupta to contest from Udhampur West, Dr. Devinder Kumar Maniyal to contest from Ramgarh (SC), and Mohan Lal Bhagat to contest from Akhnoor pic.twitter.com/GHJcBW3Xzz
— ANI (@ANI) August 26, 2024