Terrorists kill Civilian : శ్రీనగర్ లో పౌరుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లో ఓ పౌరుడిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం సాయంత్రం 5:55గంటల సమయంలో నవకదాల్ ప్రాంతంలోని ఈద్గా వద్ద రౌఫ్ అహ్మద్ అనే

Terrorists kill Civilian : శ్రీనగర్ లో పౌరుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Kashmir

Updated On : December 22, 2021 / 7:33 PM IST

Terrorists kill Civilian : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లో ఓ పౌరుడిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం సాయంత్రం 5:55గంటల సమయంలో నవకదాల్ ప్రాంతంలోని ఈద్గా వద్ద 45 ఏళ్ల రౌఫ్ అహ్మద్ అనే వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రౌఫ్ అహ్మద్ ను స్థానిక SMHS హాస్పిటల్ కు తరలించామని,అయితే తీవ్ర గాయాలతో అహ్మద్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించినట్లు తెలిపారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.

కాగా,నవంబర్ 30న కేంద్రప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపిన వివరాల ప్రకారం..జమ్మూకశ్మీర్ లో ఈ ఏడాది నవంబర్ 15 వరకు ఉగ్రసంబంధిత ఘటనల్లో 40మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా,72మంది పౌరులు గాయపడ్డారు. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు సమాధానమిచ్చారు.

ALSO READ Pralay Missile : షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ “ప్రళయ్”ప్రయోగం విజయవంతం