తబ్లీగ్ జమాత్ సదస్సు గురించి సోషల్ మీడియాలో పోస్టులు, ఐదుగురి అరెస్ట్

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 07:20 AM IST
తబ్లీగ్ జమాత్ సదస్సు గురించి సోషల్ మీడియాలో పోస్టులు, ఐదుగురి అరెస్ట్

Updated On : April 5, 2020 / 7:20 AM IST

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ సదస్సు గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి అభ్యంతరకంగా ఉన్నాయి. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, గొడవలు సృష్టించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పోస్టులు పెట్టిన వారిని గుర్తించి అరెస్ట్ చేశారు.

రాకేష్ సాము, బల్ దేవ్ సింగ్, రామ్ నారాయణ్ సింగ్, ముంతాజ్ ఖాన్, ఖలీద్ మాజిద్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్లు 188, 295(ఏ), 120(బీ) కింద వారిపై కేసులు నమోదు చేశారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మర్కజ్ భవనంలో జరిగిన జమాతే సదస్సులో పాల్గొన్న వారిలో చాలామందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. జమాతే సదస్సు తర్వాత దేశంలో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ వ్యవహారం రచ్చకు దారితీసింది. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తబ్లీగ్ సదస్సుని టార్గెట్ చేశారు. రెండు వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, అసత్య ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.